రూ.500లకే జియో ఫోన్ !!!

     రూ.500లకే జియో ఫోన్..
                             ఏమేం ఉంటాయో తెలుసా?!!

 • రిలయన్స్ జియో ప్రస్థానమే ఓ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 
 • భారతీయ టెలికం మార్కెట్ లో పోటీ కంపెనీలన్నిటికీ చుక్కలు చూపిస్తున్న ముఖేష్ అంబానీ.. అదే తరహాలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. 
 • దేశంలోనే అత్యంత చౌక ధరలో ఫీచర్ ఫోన్ లాంఛ్ చేయబోతున్నది. 
 • జులై నెల్ ఎండ్ కల్లా కొత్త ఫోన్ వచ్చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 • ఈనెల 21వ తేదీ రిలయన్స్ వార్షిక సదస్సు జరుగుతోంది. 
 • ఈ సమావేశంలోనే అంబానీ గ్రాండ్ గా ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. 
 • రూ.500 ధరలో ఈ ఫీచర్ ఫోన్.. 4జీ నెట్ వర్క్ (వోల్ట్) పనిచేస్తోంది. 
 • ఇప్పుడు అకస్మాత్తుగా జియో అధినేత ముఖేష్ అంబానీ ఈ తక్కువ రేటు ఫోన్ ను అర్జెంట్ గా లాంఛ్ చేసే నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం లేకపోలేదు..
 • మార్కెట్ లో 4జీ నెట్ వర్క్ లో పని చేసే ఫోన్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. 
 • ఈ కారణంగానూ జియో కస్టమర్లు భారీగా పడిపోయారు. 
 • దీన్ని అధిగమించేందుకు 4జీ వోల్ట్ హ్యండ్ సెట్లను విడుదల చేస్తోంది రిలయన్స్. 
 • ఈ తక్కువ రేటు ఫోన్ హ్యాండెసెట్లను అత్యంత చౌకగా.. కేవలం రూ.500కే అందించాలని నిర్ణయించింది. 
 • జియో 4జీ ఫోన్లతో గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లు భారీ సంఖ్యలో పెరగనున్నట్లు అంచనా వేస్తుంది. 
 • జియో 4జీ వోల్ట్ ఫోన్లతో రెండు కోట్ల మంది కస్టమర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది కంపెనీ.
Share This :

Related Postsentiment_satisfied Emoticon