ఒక నెలలో 6 కిలోల బరువు తగ్గించే ఒక అద్భుతమైన జ్యూస్బొద్దుగా మరియు ఫ్యాట్ ఉన్న శరీరంను చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి శరీరంతో నలుగురిలోకి వెళ్ళలేక, ఇష్టమైన దుస్తులును ధరించి, అందంగా తయారవ్వలేక చాలా ఇబ్బందికరంగా బాధపడే వారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా ఎక్స్ట్రా ఫ్యాట్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఊబకాయం కలిగి ఉండటం వల్ల హై కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, జాయింట్ పెయిన్, ఇన్ ఫెర్టిలిటి మొదలగు వ్యాధులను ఆహ్వానం పలకడానికి ముఖ్య సంకేతాలు . కాబట్టి, శరీరంలోని ఎక్స్ట్రా ఫ్యాట్ ను తొలగించుకోవడానికి ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను అనుసరించడం వల్ల ఎలాంటి బాధలుండవు. అదనపు కొవ్వు కరిగించుకోవడానికి ఎంపిక చేసుకొనే ఈ నేచురల్ రెమెడీస్ జ్యూసుల నుండి సేకరించినవి. బరువు తగ్గించుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ తో 5 సులభ మార్గాలు ఈజ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవచ్చు. ఈ హోం రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ సింపుల్ హోంమేడ్ జ్యూస్ ను రోజూ తాగితే ఒక నెలలో 6 కేజిల బరువు తగ్గవచ్చు. 

కావల్సిన పదార్థాలు: 
  • ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ -1/2గ్లాసు
  •  ఆపిల్ జ్యూస్ -1/2గ్లాసు
  •  అల్లం జ్యూస్-1టీస్పూన్ 
ఈ నేచురల్ రెమెడీ ఇంట్లోనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ఈ నేచురల్ డ్రింక్ ను ఒక్క రోజు కూడా మిక్స్ కాకుండా రెగ్యులర్ గా తాగాలి. అలాగే, ఈ హోం మేడ్ జ్యూస్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజు ఒక గంట వ్యాయామం చేసి, ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే ఈ జ్యూస్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువు తగ్గించుకోవడానికి తయారుచేసుకునే హోం మేడ్ క్యారెట్, యాపిల్ మరియు అల్లం జ్యూస్ బాడీ ఫ్యాట్ కరిగించడంలో అద్భుతమైనది.  ఈ హోం మేడ్ జ్యూస్ లో యాంటీక్సిడెంట్స్ అధికంగా ఉండం వల్ల జీవక్రియలు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. దాంతో వేగంగా బరువు తగ్గుతారు. అదనంగా, ఈ జ్యూస్ లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలోని ఎక్సెస్ బాడీ ఫ్యాక్ట్ ను కరిగిస్తుంది. 


Share This :

Related Postsentiment_satisfied Emoticon