కొద్దిసమయంలో మీ గ్యాస్ ను కడుపునొప్పిని తగ్గించే దివ్య ఔషధం...


  • గ్యాస్ ఎక్కువయినపుడు మొదట కన్పించే లక్షణం కడుపునొప్పి. గుండెల్లో మంట, ఆగకుండా గ్యాస్ రావటం, తేపులు, గొంతునొప్పి, వికారం,వాంతులు వంటివి కూడా రావచ్చు. ఈ అధికగ్యాస్ కి కారణం మానసిక వత్తిడి కూడా కావచ్చు. ఎందుకంటే కార్టిసోల్ అనే హార్మోన్, మీరు అధిక వత్తిడిలో ఉన్నప్పుడు,శరీరంలో పెరిగి కడుపులో అధికంగా యాసిడ్లు ఉత్పత్తి చేస్తుంది. 
  • జీవనవిధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యలు రాకుండానే చూసుకోవచ్చు. మీరు ఒకవేళ దీన్ని చిన్నదే అని పట్టించుకోకుండా వదిలేస్తే, అది పెద్దదయి, ప్రేగులను తినేయటమో, పెద్దపేగు క్యాన్సర్ కి కూడా దారితీయవచ్చు.
  • అందుకని కడుపు పాడయ్యే ఏ పనుల నుంచైనా దూరంగా ఉండటం ముఖ్యం. అంతేకాదు, దానికి త్వరగా చికిత్స తీసుకోవడం కూడా అవసరం.
  • చాలాసార్లు, మనం కడుపునొప్పికి, గ్యాస్ కు యాంటాసిడ్లు తీసుకుని వెంటనే ఉపశమనం పొందుతాం. అత్యవసర స్థితులలో పెయిన్ కిల్లర్స్ కూడా అవసరమవ్వచ్చు. అధిక గ్యాస్, కడుపునొప్పికి సహజ చికిత్స కోసం చూస్తున్నట్లయితే, ఈ వంటింటి చిట్కా చూడండి . 
కావాలసిన వస్తువులు ; 

  • తాజా గుమ్మడికాయ రసం - ½ గ్లాసు
  •  యాపిల్ సిడర్ వెనిగర్- 3 చెంచాలు

 ఈ పద్ధతిని ఎప్పుడూ సాధారణంగా వాడుతూ ఉంటే, ఈ సహజ చిట్కా కడుపునొప్పి, అధిక గ్యాస్ కు అద్భుతంగా పనిచేస్తుంది.ఇంకా మీరు ఆరోగ్యకర జీవన విధానాలు పాటించి, మంచి ఆహారం తిని, ఎసిడిటీ వచ్చే పదార్థాలు తినటం మానేయాలి. ఇది బాగా పనిచేయాలంటే రోజూ వ్యాయామం తప్పనిసరి గుర్తుపెట్టుకోండి, మీ కడుపునొప్పి గ్యాస్ వల్ల వచ్చినది కాకపోతే, ఈ చిట్కా పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు మీరు వైద్యున్ని సంప్రదించటం మంచిది. గుమ్మడి రసం సహజ క్షారం, ఇది మీ ప్రేగులకు చల్లగా ఉండి మంట తగ్గించి, ఎసిడిటీ, కడుపునొప్పిని తగ్గిస్తుంది. యాపిల్ సిడర్ వెనిగర్ కూడా మరొక సహజ పదార్థం. ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే అధిక ఆమ్లాలను సమం చేసి, యాసిడ్ రిఫ్లక్స్ ( అంటే ఆమ్లాలు ఆహారనాళంలో వెనక్కి ప్రవహించి గొంతులోకి తన్నుకురావటం), అధిక గ్యాస్, కడుపునొప్పిని తగ్గిస్తుంది. యాపిల్ సిడర్ వెనిగర్ కడుపులో వాపును కూడా తగ్గిస్తుంది.Share This :

Related Postsentiment_satisfied Emoticon