పెరుగుతో అద్భుత ఫలితాలు



పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి.

  •  కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
  • కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
  • కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
  • కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
  •  ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
  • పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
  • పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
  • పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.
  • పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.
  • పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.
Share This :

Related Post



sentiment_satisfied Emoticon