పరమాత్మ ప్రాప్తి


బమ్మెర పోతన భాగవతములో గజేంద్ర మోక్షంలో గొప్ప పద్యం. తాత్పర్యం మాత్రమే వ్రాయబడుతుంది. ఈ జగము ఎవ్వరిచే సృష్టించబడిందో, ఎవరిలో ఉంటుందో, ఎవరిచే లయింపబడుతుందో, మూలకారకుడెవ్వడో, ఆది మధ్య అంతం లేని వాడెవ్వడో, సర్వం తానైన వాడెవ్వడో, సర్వశక్తిమంతుడెవ్వడో అతనినే నేను శరణు వేడుతున్నాను అని అంటాడు గజేంద్రుడు. పరమాత్ముడు, పరమే శ్వరుడు, దేవదేవ్ఞడైన ఆ పురుషోత్తముడిని వేడుకొంటాడు. ఈ వ్యాసములో పురుషోత్తముడి వర్ణన తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ, పరమేశ్వరుడు, పురుషోత్తముడు అక్షర పరబ్రహ్మ అన్న ఆ పరమాత్మయే. ఇక నుండి పరమాత్మ అని వ్రాయబడుతుంది.

పరమాత్మ ఉత్కృష్టుడు. సృష్టి స్థితి లయకారకుడు. నీళ్లలో రుచి, సూర్యచంద్రులలో కాంతి భూమి యందు వాసన, తాపసులలో తపస్సు, అన్ని జీవ్ఞలలో ప్రాణం, అన్ని యందు తేజస్సు బుద్ధి మంతులలో బుద్ధి, ధీరులలో ధైర్యం అయి ఉన్నాడు. బ్రహ్మకు ఆధికారకుడు, అనంతుడు, నాశరహితుడు. సత్‌, అసత్‌లకు పరమైనవాడు, ఆదిదేవ్ఞడు, ప్రాచీన పురుషుడు, సనాతనుడు, జగద్కారకుడు, జగదాధారుడు సమస్తము తెలిసినవాడు, తెలియదగినవాడు,
శాశ్వితుడు, కోరికలు కల్పించువాడు, కోరికలు తీర్చువాడు, కర్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని తెలియజేయువాడు, శ్రద్ధ విశ్వాసములు ప్రసాదించు వాడు. కవి, పురాణ పురుషుడు, అణువ్ఞ కంటే చిన్న రూపము గలవాడు, ఊహించలేని శరీరము కలవాడు, సులభ సాధ్యుడు, పరమపూజ్యుడు, ఉత్తమ గురువ్ఞ ముల్లోకములో సాటిలేనివాడు, అతని కంటే సమానమైన వాడు, కాని అతనికంటె అధికమైనడెవ్వడు లేడు. జీవిత చక్రములోని దశలు. తల్లిగర్భం, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం దేహాంతర ప్రాప్తి. ఇది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. జగద్గురువ్ఞ శంకరాచార్యులుగారు చెప్పినటుల పునరపిజననం పునరపి మరణం పునరపి జననే జఠరేశయనం. యః సంసారే బహుదుస్సారే కృపయాపారే పాహి మురారే. ఇది నిరంతరం కొనసాగుతుంది. దీనిని తప్పించుట కొరకు ప్రయత్నం చేయుట ప్రతిజీవికి అవసరం. దానికై నిరంతరం కృషి చేయవలసి ఉంటుంది.

అభిమానం, మోహం లేనివారు, ఆసక్తి అనే శోషమును జయించినవారు నిరంతరం పరమాత్మను కొలుచువారు మాత్రం పరమపదం విష్ణు నివాస స్థానం చేరుకోగలుగుతారు. దానిని చేరిన వారికి పునర్జన్మ ఉండదు. పర మాత్మను భక్తి భావముతో ఎవరు ధ్యానిస్తారో వారు పరమాత్మ ప్రాప్తి పొందుతారు. పరమాత్మను నమ్ముకొన్నవారు. దుఃఖ భూయిష్టము అశాశ్వితమైన అయిన ఈ లోకములో తిరిగి జన్మింపరు. అదియే జీవ్ఞని లక్ష్యం అయి ఉండాలి.
Share This :

Related Postsentiment_satisfied Emoticon