ఆత్మానందానికి అంతర్ముఖ యానం:అరుదైన మానవదేహమనే రథం సహాయంతో ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందవచ్చో కఠోపనిషత్తు వివరిస్తుంది.
౧. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు!
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ!! (కఠోపనిషత్తు)
శరీరం – రథం; ఇంద్రియాలు – గుర్రాలు; ఇంద్రియ విషయాలు – మార్గం; మనసు – కళ్ళెం; బుద్ధి – సారథి; ఆత్మ – రథికుడు.
శరీరం అనే రథానికి ఇంద్రియాలే గుర్రాలు. గమ్యస్థానానికి చేర్చేందుకు రథానికి గుర్రాలు ఎంత ముఖ్యమో మన గమ్య స్థానమైన మోక్షస్థానానికి చేర్చడానికి ఇంద్రియాలూ అంతే ముఖ్యం. గుర్రాలకు చంచలత్వం ఎంత సహజమో ఇంద్రియాలకు కూడా చంచలత్వం అంతే సహజం. అదుపులో లేని గుర్రాలు రథికుణ్ణి గమ్యానికి సురక్షితంగా చేర్చలేవు. అధీనంలో లేని ఇంద్రియాలు కూడా మనిషిని పరమపదానికి చేర్చలేవు. కాబట్టి సారథి కళ్ళాన్ని పట్టుకొని నేర్పుతో గుర్రాలను సవ్యమైన మార్గంలో నడిపించినప్పుడే క్షేమంగా గమ్యానికి చేరగలుగుతాం. అలాగే చంచలమైన ఇంద్రియాలను మనసు అనే కళ్ళెంతో అదుపుచేస్తూ బుద్ధి అనే సారధి, రథం అనే శరీరాన్ని నడిపించినప్పుడే మోక్షపదాన్ని చేరుకోవడం సాధ్యమని కఠోపనిషత్తు వివరిస్తుంది.
రథం దృఢంగా ఉండవచ్చు. సారథి నైపుణ్యవంతుడు కావచ్చు, మార్గం సుగమంగా ఉండవచ్చుకానీ గుర్రాలు అదుపులో లేకపోతే గమ్యాన్ని చేరుకోలేం. మన జీవన యాత్రలో ఇంద్రియాలనే గుర్రాలు అధీనంలో లేకపోతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం అసాధ్యం. కాబట్టి బహిర్ముఖమైన ఇంద్రియాలను అంతర్ముఖం కావించి ప్రయాణం కొనసాగి
Share This :

Related Postsentiment_satisfied Emoticon