యజ్ఞములు వాటి ఫలములు


యజ్ఞములు వాటి ఫలములు:పార్వతీదేవి నాధా ! యజ్ఞములు వాటి ఫలములు చెప్పండి అని అడిగింది. పరమశివుడు పార్వతీ ! యజ్ఞములు రెండు విధములు. ఒకటి వైదికయజ్ఞము. రెండవది లౌకికయజ్ఞము. వైదికయజ్ఞము అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు న్యాయంగా ధనము సంపాదించి ఆ ధనముతో దేవతలను తృప్తి పరచడానికి ఋత్విక్కులతో చేయించే యజ్ఞములు వైదికయజ్ఞము అంటారు. దేవతలకు ఉత్సవములు, బ్రహ్మోత్సవములు, గీత, వాద్య, నృత్య ప్రదర్శనలు ధూపదీప నైవేద్యములు, ఊరేగింపులు, రధోత్సవములు మొదలైనవి లౌకిక యజ్ఞములు అని అంటారు. ఈ రెండూ దేవతలకు ప్రీతి పాత్రములే. దాన ధర్మములు చెయ్యడం, మంచి వ్రతాలు ఆచరించడం, ఇవన్నీ కూడా యజ్ఞములకు సాటిరావు. యజ్ఞము చేసిన వాడు లోకోత్తరుడు. అతడికి ఇవ్వడము అతడి నుండి తీసుకొనడము అధికమైన పుణ్యము కలుగజేస్తుంది. కాని వైదికయజ్ఞములు శ్రద్ధాభక్తితో చెయ్యాలి. కాని మనస్సు ఎక్కడో పెట్టి చెయ్యరాదు. అలా చేసిన యజ్ఞము చేసిన ఫలము దక్కదు.
Share This :

Related Post



sentiment_satisfied Emoticon