పద్మశాలీయులకు అత్యంత విలువైన విషయం


పద్మశాలీయులకు అత్యంత విలువైన విషయం :
శ్రీ పద్మావతీ దేవి పద్మశాలీయుల ఇంటి ఆడపడుచు !!
శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మశాలీయుల అల్లుడు !!
(తామ్ర శాసన ఆధారాలతో నిరూపణ)
పద్మావతి దేవి :
తిరుమల పద్మావతి(లక్ష్మి) పద్మశాలి ఇంటి ఆడపడుచు అన్న విషయం అందరికీ తెలిసినదే
పూర్వం పదిహేనవ శతాబ్థిలో పద్మశాలీయులకు చేనేత వృత్తిలో జీవనం గడిపే ఆశ్రిత కులస్థులకు వివాదం జరిగినది "అన్నమాచార్య" గారి మనువడు అయిన "తాళ్ళపాక చిన్నయ్య"గారిని ఆశ్రయించగా
ఆయన పద్మావతి దేవిని ఆరాధించి సమాధానం తెలుపమని కోరెను అంతట
సాక్షాత్తు "పద్మావతీ దేవి" యే ప్రత్యక్షంగా
"నేను పద్మశాలి ఇంటి ఆడపడుచును"
అని సమస్త ప్రజానికం సమక్షంలో పలికెను
ఇదే విషయాన్ని "1541" లో తామ్రశాసనం లికించారు
ధనికులైన పద్మశాలీలు పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం తాళ్ళపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20 వేల వరహాలు విరాళం సమర్పించినట్లుగా శాసనాధారాలున్నాయి.
అన్నమయ్య సంకీర్తనలో ఇలా కూడా పెర్కొన్నాడు
"పంచ భూతములనెడు పలువన్నెల నూలుతో నేసి, నీడనుండి చీరలమ్మే నే బేహారి"
అని అన్నమయ్య వేంకటేశ్వరుని వర్ణించడం గమనించ దగిన విషయం.
తిరుపతి దేవస్థానం వారు "సిరి కొలువు" అనే పుస్తకం ప్రచురించారు
అందులో స్పష్టంగా రాయటం జరిగింది శ్రీమహాలక్ష్మి మరియు పద్మావతీ దేవి పద్మశాలీ ఇంటి ఆడపడుచుయని
అనేక వైష్ణవ క్షేత్రాల్లో  స్వామీ అమ్మవార్లకు ప్రథమ కార్యాలు  వస్త్రాభరణాలు సమర్పించి కన్యాదానం చేయటం చీరసారే వంటి ఆడపడుచు లాంచనాలు  "పద్మశాలీయులే" చేయటం ఆచారంగా ఉన్నది

తిరుపతి., శ్రీరంగం.., అహోబిలం .., తిరుచానూర్., నారాయణవనం., శ్రీనివాసమంగాపురం., జమ్మలమడుగు., మంగళగిరి..,
108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఇప్పుడు అదియే ఆచరణలో ఉన్నది
శ్రీ మహాలక్ష్మి పద్మశాలి ఇంటి ఆడపడుచు కనుకనే తనకు పద్మశాలీలపై (పుట్టింటి వారిపై) గల అభిమానంతో మరల పద్మావతి గా జన్మించినది
సిరికి పుట్టింటివారు
హరికి అత్తింటివారు పద్మశాలీయులు...!
Share This :

Related Postsentiment_satisfied Emoticon