పునర్జన్మ ఉందా? లేదా ?


పునర్జన్మ:పార్వతీదేవి నాధా ! భూలోకంలో పునర్జన్మ ఉందని కొందరు లేదని కొందరు వాదులాడుకుయంటారు. ఈ సందేహము ఎంతకీ మానవులను వదలడం లేదు కనుక దాని గురించి వివరించండి అని అడిగింది. పరమేశ్వరుడు నవ్వి ఈ సందేహం మానవులకే కాదు దేవతలకు కూడా ఉంది. ఈ విషయంలో ఎవరికీ ఖచ్చితమైన అభిప్రాయంలేదు. పునర్జన్మ ఉన్నది కాని ఈ విషయము వేదపరిజ్ఞానము కలవారికే బోధపడుతుంది అని అన్నాడు ఈశ్వరుడు. పార్వతి నాధా ! మానవులు చనిపోగానే వారికి ఉన్న ఆకారము పోతుంది. అంటే స్థూల శరీరము పోతుంది. శరీరమే లేనప్పుడు యమభటులు ఈ మానవుడిని ఎలా యమలోకానికి తీసుకు వెళ్ళగలరు ? అని అడిగింది. శివుడు పార్వతీ ! ఆయువు తీరగానే మానవుడు ఈ శరీరాన్ని విడిచి పెడతాడు. అప్పుడు యమభటులు ఆ ప్రాణాన్ని ఒక సూక్ష్మశరీరంలో ప్రవేశపెడతారు. తరువాత మంచివారు, ధర్మాత్ములు, పుణ్యకార్యములు చేసిన వారు అయిన మానవులను చక్కటి రాజ మార్గములో తీకసుకు వెళ్ళి యమధర్మరాజు ముందు నిలబెడతాడు. యముడు వారు చేసిన పుణ్యకార్యములను విచారించి పుణ్యలోకములకు పంపుతాడు. కొంచం తక్కువగా పుణ్యం చేసుకున్న వారిని తిరిగి మానవ లోకంలో పుట్టమని పంపుతాడు. పాపం చేసిన వారిని నరకానికి పంపుతాడు అని పలికాడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon