పుణ్యలోకములో భోగములు ఎలా ఉంటాయి ?


ధర్మములు:పార్వతీదేవి నాధా ! ధర్మము నానా విధములుగా ఉంటుంది కదా ! ఆ ధర్మము యొక్క విశేషముల గురించి తెలియజెయ్యండి అని అడిగింది. పరమశివుడు పార్వతీ ! పార్వతీ శృతులలో చెప్పిన ధర్మముల గురించి వివరిస్తాను. ధర్మములలో జాతిధర్మములని, కులధర్మములనీ, గుణధర్మములనీ, శరీరములను బట్టి కాలము బట్టి మారే ఆపద్ధర్మము అని ధర్మములు అయిదు విధములు.
పుణ్యము లోకములు:పార్వతీదేవి నాధా ! పుణ్యలోకములో భోగములు ఎలా ఉంటాయో వివరించండి అని అడిగింది. పరమశివుడు పార్వతీ ! ఆ లోకములో పుష్పములు ఆయా ఋతువులను పూస్తూ ఉంటాయి. కల్పతరువుల నుండి శరీరానికి లేపనము సువాసనలు వెదజల్లు తుంటాయి. అక్కడ అమృతమే ఆహారము. అక్కడ దుస్తులు మలినము లేనివి. ఆభరణములు నిరుపమానంగా మెరుస్తూ ఉంటాయి. అక్కడ అందరూ పరస్పర స్నేహభావంతో మెలగుతుంటారు. అక్కడ ఉన్న వారి మనసులో మార్దవము, సుగుణములు విరాజిల్లుతుంటాయి. అక్కడ సుఖము తప్ప దుఃఖము లేదు. అక్కడ కోపము మొదలైన దుర్గుణాలకు తావు లేదు. అక్కడ ఉన్న వారు రోగములు, ముసలితనము అనేది తెలియకుండా నిరంతరము ఆనందములో తేలియాడు తుంటారు అని మహేశ్వరుడు చెప్పాడు.
సుగతి దుర్గతి:పార్వతీదేవి నాధా ! చనిపోయిన తరువాత వీరు సుగతికి పోవాలి. వీరు దుర్గతికి పోవాలి అని ఎవరు నిర్ణయిస్తారు అని అడిగింది. పరమశివుడు పార్వతీ ! తనతోటి వారికి కీడుతలపెట్టని వారు, ఎల్లప్పుడు సదా ధర్మంగా బ్రతికేవారు, సజ్జనులను, గురువులను పూజించేవారు, ఎల్లప్పుడూ సత్యమునే మట్లాడేవారు, దీనులను ఆదరించు వారు, అతిధులను పూజించు వారు, ఇతరులపట్ల దయ జాలి కలిగిన వారు, వీరంతా స్వర్గమునకు పోవడానికి అర్హులు అని తెలుసుకొన వలెను అని చెప్పాడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon