రైలు జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్!!

  

   రైలు జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి 
బంపర్ ఆఫర్!!


  • రైలు ప్రయాణీకులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జనరల్ భోగీల్లో ప్రయాణించే వారికి చల్లని కబురు చెప్పింది. తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని తాజాగా ఓ మంచి నిర్ణయం తీసుకుంది. 
  • సాధారణ 3 టైర్‌ ఏసీ క్లాస్ కన్నా తక్కువ ధరకే ఈ సదుపాయం కల్పిస్తోంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
  •  ఎకానమీ బోగీలతో పూర్తి ఏసీ రైలును ఏర్పాటు చేయనుంది. రైల్లో మిగతా ఏసీ బోగీలతో పాటుగానే ఇవి కూడా ఉంటాయి. 
  • ఏదిఏమయినా రైల్వే శాఖ వీలైనంత ఎక్కువ మందికి ఏసీ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న శుభ సంకల్పంతో పనిచేస్తోంది. తొలుత కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ఏసీ రైళ్లను ప్రవేశపెట్టే యోచన చేస్తున్నారు. 
  • ఈ మేరకు రైళ్లు, స్టేషన్లలో ఇప్పుడున్న వసతులను మరింత మెరుగుపరిచేందుకు రైల్వే ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది.
  • ఎయిర్ లైన్స సంస్థలు తమ విమానాల్లోని సీట్లను లగ్జరీ, ఎకానమీ తరగతులుగా విభజించి ప్రయాణికులకు సేవలందిస్తాయి. ఇదే విధానాన్ని ఇండియన్ రైల్వేస్ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతోంది. 
  • విమానాల తరహాలో ఎకానమీ ఏసీ క్లాస్‌ ను రైలులో అందుబాటులోకి తేనుంది. 3 ఏసీ టారిఫ్‌ కన్నా తక్కువ చార్జీలను వసూలు చేస్తూ దీనికి ఆదరణ పెంచుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
  •  గరీబ్ రథ్, దురంతో తరహాలో పూర్తిస్థాయి ఏసీ రైలులో ఏసీ-1, ఏసీ-2, ఏసీ-3 తో పాటు ఎకానమీ క్లాసులు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఎకానమీ ఏసీ కోచ్‌ లలో ప్రయాణించేవారికి ప్రత్యేకంగా దుప్పట్లు అవసరంలేదని చెప్పారు. 
  • ఎందుకంటే ఈ కోచ్‌ లలో మరీ వణుకుపుట్టించేంత ఏసీ సరఫరా కాదని వారు అన్నారు. ఈ ఎకానమీ తరగతిలో కోచ్ టెంపరేచర్ 24-25 డిగ్రీల మధ్య ఉంటుందని వారు అన్నారు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon