పూర్వ జన్మ స్మృతి ఉంటుందా??


పూర్వ జన్మ స్మృతి:పార్వతీ ! నరుడు మరణించగానే జన్మించిన అతడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాడిని జాతి అమరుడు అంటారు. కాని వయసు వచ్చేసరికి పూర్వజన్మ స్మృతి పోయి మామూలు మనిషి ఔతాడు. ఇలా కొంత మందికి మాత్రమే జరుగుతుంది. ఇలా పూర్వజన్మ స్మృతి కలగడణం వలన పూర్వజన్మ ఉందని రుజువు మానవులకు ఔతుంది. ఒక్కోసారి మరణించిన మానవుడు తిరిగి బ్రతకడం జరుగుతుంది. ఒక్కోసారి యమభటులు పొరపాటున ఒకరికి బదులు ఒకరిని తీసుకు పోతుంటారు. యముడు ఆ పొరపాటును సరిదిద్ది తిరిగి భూలోకానికి పంపిస్తాడు. ఇలాంటివి అక్కడక్కడా జరుగుతుంటాయి అని చెప్పాడు శివుడు. పార్వతీదేవి మహాదేవా ! స్వప్నము అంటే ఏమిటి ? అని అడిగింది. పార్వతీ ! నరుడు నిద్రించే సమయంలో ఇంద్రియములు పని చెయ్యవు. కేవలము మనసు మాత్రమే పని చేస్తుంది. ఆ మనస్సు దర్శించేది స్వప్నము లేక కల అంటారు. ఒక్కోసారి ఈ స్వప్నంలో జరగబోయే విషాయాలు కూడా కనిపిస్తాయి అని చెప్పాడు మహేశ్వరుడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon