ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు అని మీకు తెలుసా ??


ఆశ:ధనము తరువాత ఆశ మానవుడిని నాశనం చేస్తుంది. ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు. ఆశను వదిలితే కలిగే సుఖము దేనికీ సమానము కాదు. ఆశ అనేది మనిషితోపాటు పుడుతుంది. మనిషి చచ్చేదాకా అతడిలో ఉన్న ఆశచావదు. కనుక ఆశ ప్రాణాలను తీయకలిగిన ప్రాణాంతక వ్యాధి. కోరికలు అనేవి ఒకటి వెంట ఒకటి పుడుతూ ఉంటాయి. కోరికలు అనుభవిస్తే తీరేవి కాదు. అగ్నిలో నెయ్యి వేస్తే అగ్ని ఆరిపోతుందా ! అలాగే అనుభవించే కొద్దీ కొత్త కొత్త కోరికలు పుట్టుకు వస్తుంటాయి. కోరికలను ఆశను అదుపులో పెట్టుకుంటే అంతులేని సుఖంకలుగుతుంది. మానవుడు ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఇంద్రియములను వాటి ఇష్టము వచ్చినట్లు పోనిస్తే అవి చేయకూడని పనులు చేసి దుఃఖముకలిగిస్తాయి. అలాకాకుండా కోరికలను నిరోధిస్తే మానవునికి సుఖము కలుగుతుంది. మరణం తరువాత సద్గతులు కలుగుతాయి. ఎప్పుడూ ధనము సంపాదించడం లోనూ ఇంద్రియ సుఖములు అనుభవించడంలోనూ మునిగి తేలే వాడిని మృత్యువు ఒక్క సారిగా మీదపడి అడవిలో పెద్దపులి మేకమీద పడి కబళించినట్లు కబళిస్తుంది. మానవుడు సంపాదించిన ధనము, అతడు చేసిన ధర్మములు, యజ్ఞములు, యాగములు, అతడిని మృత్యువు నుండి కాపాడ లేవు. పుట్టిన వాడు చావక తప్పదు. కేవలం మోక్షసాధనతోనే ఈ జనమరణ చక్రము నుండి విముక్తి పొందగలడు. మానవుడి జీవితంలో ఒక్కొక్కరోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం గడిచేకొద్దీ అతడి ఆయువు క్షీణిస్తుంది. అతడు మృతృయువుకు దగ్గర ఔతుంటాడు. కనుక రేపటి పని ఈ రోజు, తరువాత చెప్పిన పని ఇప్పుడే చెయ్యాలి. కాలయాపన, అలసత్వము, సోమరితనము పనికి రాదు. కాలముకు వశుడైన మానవుడికి ఏమరిపాటు సహజము. కాలం గడిచే కొద్దీ ఆయుష్షు తరిగి పోతుందని గ్రహించిన నాడు ఈ సంసారం మీద విరక్తి కలుతుంది. ఆ విరక్తిమార్గము ముక్తికిసోపానము. పార్వతీ ప్రాపంచిక సుఖముల మీద కోరిక ఆశ లేక పోతే అతడు మనస్సును జయించగలడు. దాని వలన ముక్తి లభించి జరామరణచక్రము నుండి విముక్తి పొందగలడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon