జన్మను సార్థకం చేసుకోవటమంటే ఏమిటి ?


ఇక్కడ మనం అనుభవించే సుఖాలు (అవి ఏవైనను) తత్కాలితమైనవే గాని నిత్యమైన సుఖాలు కాదు.
ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించిన ఇంకా ఎదో వెలితి, ఇంకా ఎదో కావాలనే తపన. ఎందుకంటే అవి నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అనిత్యమైన, పరిమితమైన వస్తువుల ద్వార వచ్చే సుఖాలు.
నిత్యమైన, పరిపూర్ణమైన శాశ్వతమైన, సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే సాద్యం (లభిస్తుంది).
ఏమిటా ఆ నిత్య వస్తువు ? పరిపూర్ణ వస్తువు? శాశ్వత వస్తువు?
ఈ సృష్టికి ములాధారమైన ఏకమైన “పరమాత్మ” మాత్రమే (అయన దివ్య దర్శనాన్ని హృదయాలంలో సాక్షాత్కరించుకోవడమే శాశ్వత సుఖం).”నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” అని “తత్వబోధ” లో శంకరాచార్యుల వారు స్పష్టం చేసారు.అంటే నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవే, అని అర్థం.కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం , ఆనందం అందుకోనేవరకు మనవుడుకి తృప్తి వుండదు. అసంతృప్తి తీరదు.అట్టి శాశ్వతానందాన్ని అందుకోవటమే జన్మను సార్థకం చేసుకోవటమంటే.
ఆ శాశ్వతనందాన్నే మోక్షం,ముక్తి అన్నారు.అదే విముక్తి (విముక్తి అంటే దేని నుండి విముక్తి? సర్వ బందనాల నుండి విముక్తి).బంధనాలు అంటే కర్మబంధనాలే(కర్మ బంధనాలు అంటే అనంతకోటి జన్మల నుండి మనం చేస్తూ వస్తున్నా కర్మల ఫలాలే ).ఈ బంధనాలున్నంత కాలం మనం ఎదో ఒక జన్మ ఎత్తుతూ వుండాల్సిందే. అలాగాక మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవలసిందే.
Share This :

Related Postsentiment_satisfied Emoticon