అది ఉంటే చాలు మి సమస్యలకు పరిష్కార మార్గం !!!


 ‘నీకు నచ్చినట్లు బతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికీ నువ్వు నచ్చాలంటే, చిరునవ్వుతో బతకాలి’- అంటారు మనోవైజ్ఞానికులు.

లోకంలో అందరూ అందరికీ నచ్చరు. అందరూ అందర్నీ మెచ్చుకోరు. 
ఎప్పుడూ పెదవులపై చిరునవ్వులు చిందించేవారే ఎక్కువమందికి నచ్చుతారు. అలాంటివారినే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు.

చిగురాకుతో పోటీకి నిలిచేంత సున్నితమైంది చిరునవ్వు. దాని శక్తి అనంతం.
చిరునవ్వు దేవతా స్వరూపం కావడమే కారణం. ‘చిరునవ్వు వెలుగుతో విరాజిల్లే తల్లీ!’ 

(మందస్మిత ప్రభాపూరా...) అనేది లలితా సహస్ర నామాల్లో ఒకటి. *_ఇతర దేవతలకు సంబంధించిన అష్టోత్తర, శత, సహస్ర నామాల్లోనూ చిరునవ్వు ప్రస్తావనలు కనిపిస్తాయి._*

'నగుమోము గనలేని, నా జాలి దెలిసి/ నను బ్రోవగ రాద శ్రీ రఘువర...’_*అంటాడు త్యాగయ్య. చిరునవ్వుకు చిరునామాగా భాసించే శ్రీరాముడి ముఖంలో ఎప్పుడో ఏ క్షణానో అది మాయమైనట్లు ఆయన గమనించాడేమో!

‘అలాంటి నిన్ను చూడలేను కాబట్టి, చిరునవ్వు చిందిస్తూనే నాకు దర్శనమివ్వు’_* అన్నదే ఆ వాగ్గేయకారుడి వేడుకోలు. ఆయనే మరో సందర్భంలో- నగుమోము గలవాని, నా మనోహరుని, జగమేలే శూరుని, దివ్య సుందరుని... అంటూ స్వామిని పలు విశేషణాలతో కీర్తించాడు.
వాటన్నింటిలోనూ మొదటగా *_‘చిరునవ్వు ముఖం గల’_*అని ఉంటుంది. దీన్నిబట్టి, చిరునవ్వుకు గల స్థానం ఎటువంటిదో ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది.

ఖర్చు, కష్టం, ప్రయత్నం, సాధన లేకుండా- సర్వసహజంగా వెల్లివిరిసేది చిరునవ్వు ఒక్కటే._*అది మనిషి విలువను పెంచుతుంది. ఎందరినో చేరువ చేస్తుంది.

అలవాటు కావాలే కానీ, జీవితాంతం అది మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. చిరునవ్వు అనే భాషకు ఏ విధమైన ఎల్లలూ ఉండవు._*
భావం అందరికీ తెలుసు కాబట్టే, అది విశ్వవ్యాప్తమైంది.
మాట్లాడే పెదవులు పలు సమస్యల్ని తగ్గిస్తాయి. మూసి ఉంచిన పెదవులు కొన్ని సమస్యల్ని నివారిస్తాయి. చిరునవ్వుతో వికసించే పెదవులు అన్ని సమస్యల్నీ తీర్చేస్తాయి- అని విజ్ఞుల మాట._*
అందుకే మహాభారతం శాంతి పర్వంలో *_'కోపాన్ని శాంతంతో, దుష్టుణ్ని సాధుస్వభావంతో, లోభిని దానగుణంతో జయించగలం._*
చిరునవ్వు అంటూ ఉంటే, లోకంలో సర్వస్వాన్నీ జయించవచ్చు’ అంటాడు కవి తిక్కన.
‘సమస్యలకు చిరునవ్వు అంటే ఎంతో భయం. అందుకే నవ్వు వెల్లివిరిసే పరిసరాలకైనా భయం రాదు, రాలేదు’ అంటారు తత్వవేత్తలు.
మనసు నిష్కల్మషంగా ఉంటే, పెదవుల మీద చిరునవ్వు నర్తిస్తుంది. అది ఎంతగా వెల్లివిరిస్తే, మనసు అంత నిర్మలత సంతరించుకుంటుంది. చిత్తం, చిరునవ్వు- ఈ రెండూ ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నవే.


ఏదైనా పని ప్రారంభించడానికి మనిషికి ధైర్యం ఉండాలి. పని కొనసాగించడానికి కృషి, పని పూర్తిచేయడానికి గట్టి పట్టుదల అవసరమవుతాయి.

 ఆ మూడు దశల్లోనూ అతడి ముఖంమీద చిరునవ్వు ఉంటే, ఎంత శ్రమైనా సగానికి సగం తగ్గిపోయినట్లే!_*పెట్టని ఆభరణం చిరునవ్వు. అదే వివిధ సమస్యలకు పరిష్కార మార్గం.
ఎన్నో ప్రశ్నలకు ఏకైక సమాధానమూ అదే. పలకరించడానికి, ఆనందం వ్యక్తీకరించడానికి, ఎదుటివారి మనసును ఆకట్టుకోవడానికి, కఠినాత్ముడి మనసునైనా కరిగించడానికి చిరునవ్వే ఉపయోగపడుతుంది.

వయసుతో సంబంధం లేనిది; బిడియాల్ని, భయాల్ని, అనుమానాల్ని తొలగించేది చిరునవ్వు. ఎంత అననుకూల పరిస్థితిలోనైనా, స్నేహితుడిలా అది తోడుంటుంది._*అందుకే చిరునవ్వుకు ఎవరూ వెల కట్టలేరు. *_లోకంలో గల సిరులన్నింటినీ కుప్పపోసినా, దానికి అవేమీ సాటి రావు!

  అప్పో దీపో భవ

!
Share This :

Related Postsentiment_satisfied Emoticon