తినేటపుడు నీరు తాగితే నష్టమేమిటి?

తినేటపుడు నీరు తాగితే నష్టమేమిటి?

కొంతమంది నీరు తాగి వెంటనే తినడం మొదలు పెడతారు. మరికొందరు తినేటపుడు తాగితే, ఇంకొందరు తిన్నాక తాగుతారు. ఇలా నీటిని తాగటం జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగించడమే. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి పొట్టలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ ఊరుతుంది. ఆ యాసిడ్‌ మన ఆహారంతో డైరెక్టుగా కలిస్తే ఆహారం త్వరగా అరిగి పిండిపిండిగా విడగొట్టబడుతుంది. ఇలా జరగకుండా, మనం తినేటపుడు తాగిన నీరు పొట్టలోనికి వెళ్లి, లోపల ఊరిన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని పలుచగా (యాసిడ్‌కి నీరు కలిపితే గాఢత లేదా పవర్‌ తగ్గిపోతుంది.) చేసేస్తుంది. దాంతో జీర్ణక్రియకు మామూలు కంటే రెట్టింపు సమయం పడుతుంది. తినేటపుడు నీరు తాగటం వల్ల వచ్చే నష్టాలు చూస్తే, భుక్తాయాసం రావటం, కడుపులో మంటలు రావటం, అజీర్ణం కలగటం, ఆహారం ఎక్కువ సేపు నిలువ ఉండి పులవడం, గ్యాసు తయారవడం, త్రేన్పులు ఎక్కువగా రావడం, పొట్ట సాగిపోవడం మొదలగునవి అన్నీ వస్తూ ఉంటాయి. తినేటపుడు నీటిని తాగడం అసహజం. పండ్లు, పచ్చి కూరలు తిన్నపుడు మీరు బాగా నమిలి తింటున్నారు కాబట్టి గొంతు పట్టడం గానీ, ఎక్కిళ్లు గానీ రావు. ఆహారాన్ని మెత్తగా పిండిపిండిగా నమిలి, మెల్లగా తింటూ ఉంటే తినేటపుడు నీటి అవసరం రాదు. కొత్తలో వారం, పది రోజులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మెల్లగా అలవాటు అయి, మీకు తిన్నాక ఎంతో హాయి అనిపిస్తుంది. బద్దలు, నీళ్లు కలిపి పోసి రోటిలో రుబ్బితే పిండి నలగదు కాబట్టే ముందు బద్దలను రుబ్బి ఆ తర్వాత నీరు కలుపుకోవడం మన అలవాటు. అలాగే ఇక నుంచి మీ పొట్టలో కూడా అలాగే రుబ్బుకోవడానికి ప్రయత్నించండి.

Share This :

Related Postsentiment_satisfied Emoticon