నరకమనగా ఏమి ?


నరకము:పార్వతీదేవి నాధా ! నరకమనగా ఏమి ? అది ఎలా ఉంటుంది అని అడిగింది. శివుడు దేవీ ! ఈ భూమికి కిందుగా రౌరము, హారౌరము, కంటకావనము, అగ్ని కుండము, పంచాష్టకము అనే అయిదు నరకాలు ఉన్నాయి. మానవులు చేసిన పాపమును అనుసరించి ఆయా నరకాలకు వెళ్ళి శిక్షలు అనుభవిస్తుంటారు. అక్కడ కాల్చడము, నరకడం, కట్టడము, కొట్టడము, కుక్కల చేత కరిపించడం, క్రిముల చేత పీడించడం, గ్రద్దల చేత పొడిపించడం మొదలైన నరక బాధలు పెడతారు. ఆ ప్రకారము పాపములు చేసిన వారు నరక బాధలు అనుభవించి పునీతులు ఔతారు. తరువాత భూలోకములో పురుగులుగా, తరువాత పక్షులుగా, తరువాత జంతువులుగా, తరువాత మానవులుగా జన్మిస్తారు అని పలికాడు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon