ఆత్మయే లేకపోతే పునర్జన్మలు ఎవరివి ఎలాగ ?


 • దేహం అనిత్యం,కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం. ఆత్మ సర్వవ్యాపకం.దేహాలు నశించినా ఆత్మ నశించదు. ఆత్మ చంపబడుతుందని కాని,చంపుతుందనిగాని భావించేవారు అజ్ఞానులు. ఇది నాతనము అనగా ఎప్పుడు ఉండేది. మనము ఎలాగైతే చిరిగిపోయిన పాతబట్టలు వదిలి కొత్తవి వేస్కుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అగ్నికాని,గాలి కాని,నీరు గాని మరియు ఆయుధాలు కాని ఆత్మను ఏమీ చేయలేవు. ఈ విషయాలు తెలుసుకొన్నవాడు దుఃఖించడు. పుట్టిన శరీరం చావకతప్పదు. మరలా పుట్టక తప్పాడు.దీనికి బాధపడనవసరం లేదు.అన్ని దేహాలలోను ఆత్మ ఉంది.
 • క్షత్రియులకు యుద్దధర్మం శ్రేష్ఠం. నీవు దయచేత యుద్ధం మానాలని చూస్తున్నా చూసేవారందరూ నీవు పిరికితనంచే చేయలేదని అనుకుంటారు. అపకీర్తి వస్తుంది. అమర్యాద పాలవుతావు. శత్రువులు చులకన చేస్తారు. మరణిస్తే స్వర్గం,గెలిస్తే రాజ్యం పొందుతావు. సుఖదుఃఖాలను,జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు.కాబట్టి దృఢనిశ్చయుడవై యుద్ధం చేయి.
 • ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ కొంచం ఆచరించినా గొప్పఫలితాన్ని ఇచ్చి సంసారభయాన్ని దాటగలవు.ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏక కారణంగా ఉంటుంది.కొందరు స్వర్గప్రాప్తే ప్రధానమని తలచి ఆ కర్మలే చేస్తూ నిశ్చలమైన ధ్యానంకాని,బుద్ధికాని లేక జననమరణాలు పొందుతుంటారు.ప్రకృతి యొక్క మూడుగుణాలకు అతీతుడవై,సుఖదుఃఖాలను విడిచి ఆత్మజ్ఞానివి కావాలి.బావితో ఎంత ప్రయోజనముందో ఆ ప్రయోజనమే మహానదులలో కూడా ఎలా ఉంటుందో అలాగే వేదకర్మల వలన పొందే శాంతి,జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది.
 • పని చెయ్యి.కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు.అలా అని పని చేయడం ఆపకు. జయాపజయాల పట్ల సమబుద్ధి కలిగిఉండు.ఈ బుద్ది కలిగినవారు పాపపుణ్యాలు నశింపచేసుకుని మోక్షము పొందుతారు.నీ మనసు స్థిరం కావాలి. స్థితప్రజ్ఞుడి లక్షణాలు అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు,నడవడిక గురించి అడుగగా కృష్ణుడు "అన్ని కోరికలను వదిలి, దుఖానికి కలత పొందక,సుఖానికి పరవశించక,అనురాగము,కోపము,భయములను వదిలివేసి తన ఆత్మ యందె సంతోషపడువాడు స్థితప్రజ్ఞుడు అనబడుతాడు"అన్నాడు. ఇంద్రియనిగ్రహం వలెనే స్థిరబుద్ధి కలుగుతుంది.
 • విషయాలను గురించి అతిగా ఆలోచించే వాడికి వాటిపై ఆసక్తి,అది నెరవేరకపోవడంవలన కోపం,ఆ కోపం వలన అవివేకం,అవివేకం వలన యుక్తాయుక్తజ్ఞానం,బుద్ధి నశించి అథోగతిపాలవుతాడు.
 • విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియనిగ్రహం కలిగిఉండడం ,కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు.నిశ్చలత్వం లేని వాడికి శాంతి,అదిలేనివాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనము అవుతుంది. ఇంద్రియనిగ్రహం కలిగినవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. లౌకిక విషయాలందు నిద్రతోను ,సామాన్యులు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలందు జ్ఞాని మెలకువతోను ఉంటాడు.

బ్రాహ్మిస్థితి:
 • సముద్రంలోకి ఎన్ని నీళ్ళు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా,గంభీరంగా చెలియలికట్ట దాటకుండా ఉంటుందో అలానే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు.అహంకారాన్ని,కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రాహ్మిస్థితి అంటారు.ఈ స్థితిని ఎవరైతే జీవించిఉండగానే పొందగలడో అతడే బ్రహ్మనిర్వాణపదాన్ని పొందుతాడు.
 • ప్ర్రాణ శక్తి లేని శరీరము మౌనమే! కానీ అత్మకు చావు లేదు. అది ఘనీ భించదు!
 • అత్మకు అనాత్మ వస్తువులతో ఎట్టి పాణత్తునూ కుదరదు. ఆత్మకు చావు పుట్టుకలు కానీ, శోక మోహములు కానీ లేవు. ...నిశ్చలమగు పరతత్త్వమే అత్మ! జీవులు శరీరములను పొంది సత్వరజస్తమో గుణ ప్రభావములచేత కర్మములనుచేయుచు కర్మలబ్ది ప్రతిఫలమును దాని శేషమును అనుభవించుటకు జన్మలను తిరిగి తిరిగి పొందుచుండును. జీవుడు యాతనా యుతమైన జన్మలను దుఃఖములను పొందుటకన్నా తను విడివడి వచ్చిన పరమాత్మను చేరుటయే పరమలక్ష్యము.పంచ భూతములు వ్విధ నిష్పత్తులలో సంయోగము పొంది శరీరముల వంటి వివిధ పదార్థములు నిర్మాణము కాగా ఆ శరీరములకు ప్రాణ శక్తి శరీరముల నుండు నిర్గమించగానే ఆ శరీరము నియమము తప్పక విపంచీకృతమై తమ తమ నిష్పత్తుల ప్రకారము ఆయా భూతముల యందు చేరు చున్నవి. విశ్వ మందలి సమస్త శక్తులు, జలశక్తి, వాయు శక్తి, అయస్కాంత శక్తి, ఉష్ణ శక్తి మొదలుగా గల సకల శక్తులు ప్ర్రాణ శక్తి యందు లయమగు చున్నవి.
 • జాతస్య మరణం ధ్రువం అన్నది ఆరోక్తి. మృత్యువు సహజం. పుట్టిన వాడు గిట్టక మానడు. కాని మానవుడుగా పుట్టి విచక్షణా జ్ఞానాలున్న మానవుడు అమృతత్వసాధన కోసం అహర్నిశమూ తపిస్తునే ఉన్నాడు. ఉంటాడు కూడా.
 • భారతదేశం కర్మభూమి. పురాకృత జన్మలను బట్టి ఈ జన్మ వచ్చింది అనేది కొందరి నమ్మకం. ఈ నమ్మకాన్ని బట్టి చూసినపుడు పుణ్యకర్మలు చేసుకొన్నవారికి మంచి జన్మలు, పాపకృత్యాలు చేసినవారికి దుర్గతలు కలుగుతాయనేది పురాణ వచనం.
 • మనిషి అన్నవాడు పుణ్యకర్మలు చేసినా చేయకపోయినా మానవీయ దృక్పధంతో ఉండాలి. మానవ విలువలను పాటించాలి. మానవత్వం లేనినాడు మనిషి జన్మ వ్యర్థమవుతుంది అనేది కేవలం ఆధ్యాత్మిక వాదులకే కాదు హేతువాదులు అంటారు. మానవత్వం తో మెసలే విధానం ఏమిటో భారతం చెబుతుంది.
 • మనిషి ఏవిధంగా నడక సాగిస్తే మంచి మనిషిగా నిలబడుతాడనేది మనకు భారతం కళ్లముందు చూపిస్తుంది. దుర్యోధనుడులాంటి వారి దుశ్చర్యల వల్ల వారు జీవించి ఉన్నంత కాలమూ కుట్రలతోకుతంత్రపు ఆలోచనలతోను గడిపారు. మహాపరాక్రమవంతులు, దేవతలనే జయించే నైపుణ్యం కలవారైన భీష్మద్రోణాది వీరులు వెంట వుండి కూడా చివరకు దుర్యోధనాదులందరూ అసువులు బాసారు.
 • ధర్మరాజాదులు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా సదా శాంత చిత్తంతో ఉన్నారు. ఎక్కడికక్కడ వారికి ఏదో ఒక విధంగా భగవంతుని సాయం అందుతూనే ఉంది. దుర్యోధనాదుల కుట్రలను ఎదుర్కోవడానికి భుజబలం చూపించినప్పటికీ కూడా వారి దైవసాయం కావాలని తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేస్తునే ఉన్నారు.
 • స్వచ్ఛందమరణం అనే వరాన్ని పొందిన భీష్మాచార్యులు వారికి ఎన్నో నీతి నియమాలను ధర్మసూక్ష్మాలను చెప్పారు. చివరకు మానవుడు ఏవిధంగా సంతుష్టి జీవితాన్ని గడుపుతాడని, ఏవిధమైన కర్మలవల్ల ధర్మజీవనుడు అవుతాడని ధర్మరాజు అడిగినప్పుడు భీష్ముడు కేవలం తాను నిమిత్తమాత్రుడినని అనుకొంటూ సర్వమూ భగవంతుడే అని నమ్మినవారు ధర్మాన్ని అతిక్రమించలేరని చెబుతారు.
 • తన జీవితేచ్ఛను వదులుకుని నన్ను యమసదనానికి పంపివ్వమని అడిగిన ధీరోదాత్తుడు భీష్ముడు. అటువంటి భీష్మాచార్యులు యుధిష్టరునికి వినిపించిన విష్ణు సహస్రనామం చదివినందువల్ల అనేక పుణ్యగతులు వరిస్తాయి అని శృతి వాక్యం.
 • నాటి మహాభారతంలోని ప్రతి సంఘటనా నేడు భారతవనిలో జరుగుతున్నదే అంటారు. అప్పుడు జరగనిది ఇపుడు జరగడం లేదు ఇపుడు కనిపించేది పూర్వపరం అక్కడిదే అనీ అంటారు. అట్లాంటి మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో అన్నదమ్ములే సంగ్రామ యోధులు.
 • ఒకరు అసురీ ప్రవృత్తికి తార్కాణంగా నిలిస్తే మరొకరు దైవీశక్తులు చిహ్నంగా నిలబడ్డారు. బాల్యం నుంచి వైరాన్ని పెంచుకుని రోజురోజుకూ వైరభావాలనే ప్రచోదనం చేసుకొంటూ వచ్చి కూడా అనేక వాగ్దానాలు, ప్రతిజ్ఞలు కూడా చేసి కూడా చివరకు నేనీ యుద్ధాన్ని చేయలేను. నా అన్నదమ్ములను, నా గురువులను, నా పితామహులను, అంతా నావారే అయిన వీరితో నేను యుద్ధం చేయలేనని అరివీర భయంకరుడు ఎన్నో వరాలను పొందినవాడు, మరెన్నో బిరుదులు పొందినవాడు, పార్థుణ్ణే తన రథ సారథిగా చేసుకొన్నవాడు అయిన పాండవ మధ్యముడు, కాని చివరకు యుద్ధ్భూమికి తరలి వచ్చి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి, తనను తన అన్నదమ్ములనే కాక తనను కన్నతల్లిని, కట్టుకున్నభార్యను కూడా అవమానించిన వారికి బుద్ధి చెప్పే సమయం ఆసనమయ్యందని వారికి ఎలాగైనా తాము అంటే ఎవరో నిరూపించాల్సిన అవసరం, సమయం రెండూ కూడి వచ్చాయని ఇలా ఎనె్నన్ని ఆలోచనలతోనో వచ్చిన అర్జునుడు బేలమొగం వేసాడు.
 • ఆయుధాలు పట్టుకోలేక నిరుత్తుడయ్యాడు. జావగారి పోయే కవ్వడిని చేరదీసి గాండీవాన్నిచ్చి అన్నింటికీ కారణం నేనే. చచ్చేది, చంపబడేది ఎవరు అనుకొంటున్నావు. అసలు నీవు ఎవరు? నీలోపలనున్న ఆత్మకు చావుపుట్టకలు లేవు అంటూ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చేసిన గీతాబోధ నేటి నవశకానికి నారుమడే.
 • గీత వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి మనుగడకు కావాల్సిన అంశాలెన్నో వున్నాయి. నేడు విస్తరిస్తున్న అస్తవ్యస్తస్థితిని బాగుచేయడానికి కూడా కావాల్సిన వస్తువు గీతాబోధ లో ఉంది. ఇన్ని విషయాలు చెప్పి సమరానికి ఆయత్తం చేసిన తానే సారథిగా ఉండి కురుక్షేత్ర రణరంగంలో పాండవుల విజయకేతనానికి కారణమైన ఆ శ్రీకృష్ణుడే కౌరవ పక్షంలోని భీష్మాచార్యుని దగ్గర ఉపదేశం తీసుకోమని ధర్మరాజాదులకు చెప్పాడు. ఇందులోని మర్మాన్ని మననం మనిషి చేయాల్సిందే. భీష్ముడు రాజ్య రక్షణ కోసం ఆజన్మబ్రహ్మచారిగా ఉండిపోయాడు. నిత్యమూ కురువంశపీఠాన్ని సురక్షితంగా ఉంచడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేశాడు. తాను కేవలం రథసారథిగా ఉంటానని, తానే ఆయుధం పట్టనని భీష్మించిన కృష్ణుడి చేతనే ఆయుధం పట్టించి భగవంతుడు ఎంతటి భక్తపరాధీనుడో లోకానికి ఆవిష్కరించిన ధీశాలి భీష్ముడు.

నకర్మణా నప్రజరుూ ధనేనా
 • త్యాగే నేక అమృతత్వ మానశుః అన్నట్లుగా జీవించిన ఆ మహానుభావుడు దాన, దయా, ధర్మ, యుద్ధ, సత్య, క్షమా, పాండిత్య, బలవీరమనే రసగంగాధర కారుడు చెప్పిన ఈ ఎనిమిది వీరాలను కలిగిన అతి వీరాధివీరుడు భీష్ముడు. ఆ భీష్ముడు మానవత్వానికి మచ్చుతునక గా ఉండి అమృతత్వసాధన చేసిన మహావీరుడు.
 • అతడు చివరకు అన్ని ధర్మాల్లోకి ఉత్తమ ధర్మాన్ని, ఉత్తమ మార్గాన్ని సూచిస్తూ జగద్యాపకుడైన జగన్నాథుని అనుక్షణం స్మరిస్తూ ఆ సర్వవ్యాపిని అచంచలమైన నమ్మకంతో అపార భక్తి విశ్వాసాలతో పూజిస్తూ మానవీయ విలువలతో జీవించిననాడు మానవుడుగా పుట్టినందుకు సార్థకత లభిస్తుంది అని చెప్పాడు. కనుకనే నాడు నేడు కూడా గీతాపారాయణ చేసి అందులోని మర్మాలను తెలుసుకొని భవిష్యత్తు గీతను సరిదిద్దుకోవాలి. గీతను నిత్యాచరణలో అనుసంధించుకుంటే మానవుడే మహనీయుడు అవుతాడు.
 • ఇపుడు మీకు ఆలోచన మొదలవుతుంది ”ఆత్మ నిశ ్చయంలో ఉండాలి” ఇది మొత్తం జ్ఞానానికి పునాది. ఎందుకంటే ఆత్మిక జ్ఞానం ప్రారంభమయ్యేదే ఆత్మతోటి. మనలను మనం ఆత్మగా భావించకుండా దేహంగా భావించనట్లయితే జ్ఞానాధరమే నశిస్తుంది. ఆత్మయే లేకపోతే పునర్జన్మలు ఎవరివి ఎలాగ? ఆత్మయే లేకపోతే కర్మల ఖాతాలే తోడురావు. మరి మనం మంచి కర్మ ఎందుకు చేయాలి? చెడు కర్మల నుండి ఎందుకు రక్షించుకొనాలి? ఆత్మయే లేకపోతే మహాత్మ, పరమాత్మల, అస్తిత్వమే (ఉనికి) లేదు. ఆత్మగా భావించకపోతే పూర్వం మనస్థితి ఎలా వుంది? మనం ఎపుడు ఏ విధంగా అపవిత్రులు అయ్యాము. ఇపుడ పావనంగ అగుట వలన మనకు సద్గతి ఎలా కలుగుతుంది? ఇవన్నీ గ్రహించజాలము. కావున ”ఆత్మ నిశ్చయానికి” చాలా మహత్వమున్నది. ఇది లేకుండా ముక్తి – జీవన్ముక్తి, యోగం, దివ్య గుణాలు మొదలగు చర్చ కూడా నిరర్దకమవుతుంది. తరువాత జ్ఞానమునగా ఏ విషయము ఎలా ఉన్నదో దానిని అదే విధంగా గ్రమించుట. రోజంతా మనం వేలసార్లు నేను, నేను అను శబ్దాన్ని ప్రయోగిస్తుంటాము. ఈ నేను అనే శబ్దం దేనికి గుర్తు? నేను దేహాన్నా? లేక ఆత్మనా? ఈ విషయం గురించి తెలుసుకునగలము? ఈ విధంగా ముందు ఆత్మల నిశ్చయం చేసుకొనే అవసరం చాలా ఉంది. ఒక వేళ జ్ఞానవంతుడైన వ్యక్తితనను తాను ఆత్మ నిశ్చయం చేసుకోక పోతే జ్ఞానికి, అజ్ఞానికి భేదమే ఉండదు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon