పితృ యజ్ఞములు ఎవరు చేయాలి ?


పితృ యజ్ఞములు:. పరమశివుడు పార్వతీ ! గయ, కురుక్షేత్య్రము, గంగ మొదలైన పుణ్యక్షేత్రములు అధికంగా ఫలితము ఇస్తాయి. మాఘమాసము, భాద్రపదమాస బహుళపక్షము, అమావాస్య, ద్వాదశి, నవమి తిథులు ఆ తిధులలో అపహార్ణ సమయము, పితృకార్యములకు శ్రేష్ఠము. అపహార్ణ కాలము, దౌహిత్రుడు, నువ్వులు, పితృ కార్యములకు శ్రేష్ఠము. పితృకార్యములకు కోపము పనికి రాదు. అతి శుభ్రంగా ఉండాలి. మనసు నిర్మలంగా ఉండాలి. పితృకార్యములలో నెయ్యి, పెసల పప్పుతో చేసిన పాయసము, పిండి వంటలు ప్రధానమైన వంటకములు. పితృకార్యములకు శుక్లపక్షము, అనగా అమావాస్య తరువాత వచ్చు పాడ్యమితిథి పౌర్ణమి వరకు ఉండే తిథులు, ఉదయకాలము, మధ్యాహ్నానికి ముందు చెయ్యాలి. సరితిథులు, పుట్టిన రోజులు పితృకర్మలకు పనికి రావు. ఇంక పితృ కర్మలకు పిలువబడిన వారు వేదము చదివిన వారు అయి ఉండాలి. రోగిష్టివాడు, వికలాంగుడుకారాదు. సరిగోత్రికుడు, భార్యచనిపోయిన వాడు, ఇతర కులముల వారు పనిక రారు. పితృ కార్యములలో నియమించిన వారిని గంధము, పుష్పములు, ధూపము, దీపములతో అర్చించాలి.
Share This :

Related Postsentiment_satisfied Emoticon