రమణ మహర్షి దివ్య బోధ


కొంత మంది ప్రాణాయామము ద్వారా మనోనిశ్చలతకు ప్రయత్నం చెస్తూ వుంటారు
ఇలా చెయడం ద్వారా మనో నిశ్చలతను కొంత వరకు సాధించవచ్చు .శ్వాసని గమనించడం ద్వారా మనస్సుకు ఎందుకు నిశ్చలత వస్తుంది అంటే శ్వాశ ( ప్రాణము ) మరియు మనస్సు ( ఆలోచన )పుట్టుచోటు ఒక్కటే (ఆత్మే ).ఇది ఎలాగంటే రెండు ఎడ్లబండిని నియంత్రించే వ్యక్తి ఏ ఎద్దును నిలుపుటకు ప్రయత్నించినా రెండవ ఎద్దు కూడా తాత్కాలిగంగా నిలుస్తుంది .అయితే మనకు కావలసినది తాత్కాలిక నిశ్చలత కాదు .మనకు కావలసినది మనో నాశనమే .శ్వాసని నిలిపితే కేవలం మనస్సు లయమవుతుంది ( గాఢ నిద్రలోలాగా ).ఎంత దీర్ఘకాలం ప్రాణాయామము చేసిన తాత్కాలిక మనోనిశ్చలమే సిద్ధిస్తుంది .అది కూడా ఎంతసేపు చేస్తే అంత సేపే నిలుస్తుంది .లయించిన మనస్సు మరల పుడుతుంది .కాని మనం మనోలయంతో తృప్తి పడరాదు .దేవికాలోత్తరంలో కూడ ప్రణయామం కాని ,కుంభకం కానీ ,శ్వాసమీద ద్యాస కానీ  మంత్ర జపం కాని ఇలాంటివి జ్ఞానమార్గంలో ( ఆత్మ విచార మార్గంలో ) ఉండేవారికి పనికి రాదని పరమశివుడు చెప్పివున్నడు . మనది గమ్యం మనో నాశనము .మనసంటే తలపుల సమాహారమేకదా .అన్ని తలపులు మూలం నేను అన్న తలపే కాబట్టి ,నేను అన్న తలపే ( అహం )మనస్సు .మనస్సును( నేను అన్న తలుపును ) నేను ఎవరును అను ఆత్మవిచారము ద్వారా నాశనం చేయవచ్చు .అప్పుడు నేను అన్న తలపు నశించిపోయి " నేను " ( ఆత్మ ) అన్న అత్మానుభూతి కలుగుతుంది .శాశ్వతంగా నిలుస్తుంది .దీనికి కావలసిన శిక్షణ గురు ముఖతః నెర్చుకోవాలి .
Share This :

Related Postsentiment_satisfied Emoticon