పోగొట్టుకున్న కార్డులను పొందడం ఇప్పుడు చాలా ఈజీ


ఇప్పుడు అంతా కార్డుల యుగం నడుస్తోంది. ఇంట్లోంచి అడుగుతీసి బయట పెట్టాలంటే ఏదో ఒక కార్డు లేకుంటే పని కావట్లేదు.. చాలా మంది ఇలా పనిమీద వెళ్లినప్పుడో, ఇంట్లో ఎక్కడో పెట్టి దొరకకనో.. కార్డులను మిస్ చేసుకుంటారు. సమయానికి అవి దొరకలేదని తెగ హైరానా పడుతుంటారు. అటువంటి వారి ఇక ఏ టెన్షన్ అవసరం లేదు.. ఎందుకంటే మనకు ఏ కార్డు కావాలన్నా ఆయా వెబ్ సైట్లను ఓపెన్ చేసి మరొక కార్డు ఈజీగా పొందొచ్చు.. ఏ కార్డు పొందేందుకు ఎటువంటి ప్రాసెస్ ను అనుసరించాలో కింద తెలుసుకోండి..
పాన్‌కార్డు :
ఆదాయపు పన్నుశాఖ అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డు పోతే సంబంధిత ఏజెన్సీలో పాత పాన్ కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. కొత్త కార్డుకోసం అదనంగా రూ. 90 చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీ చేస్తారు. www.nsdl.pan వెబ్‌సైట్‌లో మరింత సమాచారం
తెలుసుకోవచ్చు.
రేషన్‌కార్డు :
రేషన్ కార్డు కనిపించకుంటే వెబ్‌సైట్ లోకి లాగిన్ కావాలి. అక్కడున్న usarnamem guest, password guest123 సాయంతో జిరాక్స్ కాఫీ పొందవచ్చు. దాని ద్వారా ఆన్‌లైన్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నెంబర్‌పై కార్డు జారీ చేస్తారు. దీనికి కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుందిఏటీఎం కార్డు :
ఏటీఎం కార్డును పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా ముందు సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాకు చేయించాలి. తర్వాత దాని నెంబరు ఆధారంగా కొత్తదానికోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనజర్ ఈ విషయాన్ని నిర్ధారించుకుని కొత్త కార్డు జారీ చేస్తారు. ఇందుకోసం సంబంధిత బ్యాంకులు నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి.
పాస్‌పోర్టు :
పాస్‌పోర్టు పోతే ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారిచ్చే నాన్ థ్రెస్ట్ పత్రంతో పాస్‌పోర్టు కార్యాలయం హైదారాబాద్ పేరిట రూ. 1000 డీడీ తీయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి సంబంధిత కార్యాలయానికి సమాచారం అందిస్తారు. ఆ తర్వాత మూడు నెలల డూప్లికేట్ పాస్‌పోర్టు జారీ చేస్తారు. తత్కాల్ పాస్ పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov.in లో సంప్రదించవచ్చు. ఎవరైనా పైన తెలిపిన కార్డులు పోతే వెంటనే సులభంగా కార్డులను నిర్ణీత సమయంలో తీసుకోండి.
ఓటరు గుర్తింపు కార్డు :
ఓటు వేసేందుకు కాకుండా వివిధ సందర్భాల్లో గుర్తింపు కోసం ఉపయోగపడే ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నెంబర్‌తో రూ.10 చెల్లిస్తే మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు పొందొచ్చు. కార్డు నెంబర్ ఆధారంగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డుకు
సంబంధించిన మరింత సమాచారం కోసం www.ceoandhra.nic.in వెబ్‌సెట్‌ను సందర్శించవచ్చు.
ఆధార్‌కార్డు :
ఆధార్ కార్డు పోగొట్టేకుంటే టోల్ ఫ్రీ నంబరు 18001801947కు ఫోన్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు.help@uidai.gov.in. వెబ్‌సెట్లో పూర్తి సమాచారం పొందవచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్:
వాహనం నడిపేందుకు డ్రైవింగ్ లైసన్స్ తప్పని సరి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్ ట్రేస్డ్ సర్టిఫికెట్‌తో పాటు డ్రైవింగ్ లైసన్స్ జిరాక్స్‌ను ఎల్ఎల్‌డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీవో కార్యాలయంలో అందజేయాలి. రూ.10 బాండ్ పేపర్‌పై కార్డు పోవడానికిగల పరిస్థితులను వివరించాలి. నెల రోజుల్లో తిరిగి అధికారుల నుంచి మరో లైసెన్స్ పొందవచ్చు. aptransport.org/ http://transport.telangana.gov.in/ వైబ్‌సెట్ నుంచి ఎల్ఎల్‌డీ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు పొందొచ్చు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon