ఇంట్లో పాటించాల్సిన - పాటించకూడని ఆచారాలు.


     కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.

1. కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు వినాశమును పొందుతాడు.

2. లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి మంచివి కావు. ఊరకనే మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని చెప్పు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.

3. రెండు చేతులతో తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకోవద్దు. తలను విడిచి కేవలము కంఠ స్నానము చేయకూడదు. (తల స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనములో ఉన్నది).

4. రాత్రుల్లు చెట్ల కింద ఉండరాదు. దూరంగా ఉండాలి.

5. ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

6. చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు. అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో తినే పదార్థాన్ని పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.

7. రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై(బట్టలు లేకుండా) పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకు వెళ్ళకూడదు.

8. కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయాలి. దాని వలన దీర్ఘాయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon