మీరు రోజూ వాడే ఈ వ‌స్తువుల‌కు ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంద‌ని మీకు తెలుసా..


మ‌నం మార్కెట్‌లో కొనే ప్యాక్ చేసిన ఏ వ‌స్తువుకైనా దాదాపుగా మానుఫాక్చ‌రింగ్ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. కానీ కొన్నింటికి ఉండ‌దు. అయితే అలా ఉండ‌ని కొన్ని వ‌స్తువుల‌ను మాత్రం మ‌నం ఎక్కువ కాలం వాడుతూ ఉంటాం. వాటి ఎక్స్‌పైరీ గురించి మ‌న‌కు తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల అలా కొన్ని వ‌స్తువుల‌ను గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ వాడుతూనే ఉంటాం. కానీ మ‌న‌కు తెలుసు క‌దా, నిజానికి గ‌డువు ముగిసిన ఏ వ‌స్తువును కూడా వాడ‌కూడ‌దు. వాడితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే మ‌రి ఎక్స్‌పైరీ తేదీని ప్రింట్ చేయ‌ని అలాంటి కొన్ని వ‌స్తువుల గురించి తెలుసుకుందాం.
1. ట‌వ‌ల్‌
స్నానానికి ఉపయోగించే ట‌వ‌ల్ లైఫ్ 1 సంవ‌త్స‌రం నుంచి 3 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. శుభ్రంగా నీట్‌గా వాడుకుంటే ట‌వ‌ల్స్‌ను 3 ఏళ్ల వ‌ర‌కు వాడుకోవ‌చ్చు. అలా కాకుండా ఉంటే మాత్రం ఒక ఏడాదికి మించి ట‌వ‌ల్‌ను వాడ‌రాదు. లేదంటే దానిపై ఉండే బాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్‌లు అనారోగ్యాల‌ను తెచ్చి పెడ‌తాయి.
2. స్లిప్ప‌ర్లు
కొంద‌రైతే స్లిప్ప‌ర్ల‌ను ఏళ్ల‌కు ఏళ్లు వాడుతారు. కానీ వాటిని 6 నెల‌ల‌కు మించి వాడ‌కూడ‌దు తెలుసా. ఎందుకంటే వాటి ద్వారా ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఏ స్లిప్ప‌ర్ల‌నైనా 6 నెల‌ల‌కు మించి వాడ‌కూడ‌దు.
3. బాత్ స్పాంజ్
బాత్ స్పాంజ్‌ల‌ను రెండు వారాల‌కు మించి వాడ‌కూడ‌దు. వాటిల్లో బాక్టీరియా, వైర‌స్‌లు ఎక్కువ‌గా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక వాటిని 2 వారాల‌కు మించి వాడ‌రాదు. కొత్త వాటిని కొనుగోలు చేసి వాడితే మంచిది.
4. షూస్
షూస్‌ను రెగ్యుల‌ర్‌గా వాడితే 1 ఏడాదికి మించి వాటిని వాడ‌కూడ‌దు. ఎందుకంటే షూస్ ఏడాదికి కుష‌న్‌ను కోల్పోతాయి. దీంతో పాదాల‌పై భారం ప‌డుతుంది. అంతేకాకుండా బాక్టీరియా, వైర‌స్‌లు షూస్‌ల‌లో పేరుకుపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక షూస్‌ను ఏడాదికోసారి మార్చాలి.
5. త‌ల‌దిండ్లు
వీటి జీవిత‌కాలం 2 నుంచి 3 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. ఆ త‌రువాత వాటిల్లో ఉండే కుష‌న్ పోతుంది. దీని వల్ల త‌ల‌కు స‌పోర్ట్ అంద‌దు. దాంతో మెడ నొప్పి వ‌స్తుంది. అదేవిధంగా ఏళ్ల త‌ర‌బ‌డి వాడే త‌ల‌దిండ్ల‌లో బాక్టీరియా కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక వాటిని 2 ఏళ్ల‌కు ఒక‌సారి మార్చితే మంచిది.
6. దువ్వెన
చాలా మంది దువ్వెన‌ను కూడా ఏళ్ల‌కు ఏళ్లు వాడేస్తారు. కానీ దీన్ని ఏడాదికి మించి వాడ‌రాదు. సంవ‌త్స‌రం అయిందంటే దువ్వెన‌ను కూడా మార్చాల్సి ఉంటుంది. దీంతో జుట్టులో బాక్టీరియా చేర‌దు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Share This :

Related Postsentiment_satisfied Emoticon