నిద్ర పోవడం అంటే ఏమిటి? మేలుకోవడం అంటే ఏమిటి?


ఇవి చాలా వింత ప్రశ్నలు అనుకోవద్దు.ఇలాంటి చిన్న ప్రశ్నలకు ఉన్న గొప్ప సమాధానాన్ని తెలుసుకోడమే సత్యాన్వేషణ.
మేలుకోవడం అంటే ...మనసు ఈ ప్రపంచం తో సంధానము అవ్వడం. నిద్ర పోవడం అంటే మన జ్ఞానేంద్రియాలను ప్రపంచం నుండి డిస్కనెక్ట్ చెయ్యడం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఎందుకన్నారంటే....అన్నిటికంటే కళ్ళే ఎక్కువగా ఈ ప్రపంచంతో కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో....90%ప్రపంచం తో డిస్కనెక్ట్ అయ్యినట్లే.....కళ్ళు మూసుకున్నవెంటనే మిగిలిన జ్ఞానేంద్రియాలను ప్రపంచం నుండి వెనక్కు మళ్లించడం చాలా సులభం. అందుకే కళ్ళు మూసుకున్న కొద్ది సేపటికి అన్ని అవయవాలూ....సులభంగా విశ్రాంతిలోకి వచ్చి మనిషి నిద్రలోకి జారుకుంటాడు.
కళ్ళు తెరుచుకొని ఉంటే.....మాత్రం నిద్ర రావడం అసాధ్యం.
అందుకే ధ్యానం కూడా కళ్ళు మూసుకొనే చేయాలి. కళ్ళను ప్రపంచంనుండీ ....డిస్కనెక్ట్ చెయ్యకుండా నిద్రపోవడం, ధ్యానం చెయ్యడం చాలా కష్టం.
 కానీ నిద్రలోనూ ,ధ్యానం లోనూ రెండుచోట్లా మనం కళ్ళుమూసుకుని జ్ఞానేంద్రియాలకు విశ్రాంతినిస్తాం. అలా అని నిద్ర,ధ్యానం ఒక్కటి కాదు. నిద్రలో మనస్సుతో పాటూ ...."చిత్" ( అహం లేదా ఆత్మ ను తెలుసుకోగల్గిన శక్తి) కూడా ఆత్మయందు లయం అవుతుంది. కానీ ధ్యానంలో మనోలయం మాత్రమే జరిగి, చిత్ శక్తి చైతన్యం లో ఉండి..... నీవు నీ ఆత్మను తెలుసుకోగల అవకాశం ఉంటుంది.
చిత్ శక్తి ,మనస్సు రెండూ లయం ఐతే దాన్ని నిద్ర అంటాం.
చిత్ శక్తి, మనస్సూ రెండూ  చైతన్యంలో ఉంటే....అది మెళుకువ.
చిత్ శక్తి చైతన్యంలో ఉండి, మనస్సు లయం ఐతే....అదే ధ్యానం.
Share This :

Related Postsentiment_satisfied Emoticon