పండ్లను అధికంగా తినటం వలన కలిగే ప్రయోజనాలు


ఏ రకమైన వ్యాధికి గురి అయిన వైద్యులు మాత్రం పండ్లను ఎక్కువగా తినమని సలహా ఇస్తూంటారు. కారణం మన శరీరానికి అవసరం అయ్యే అన్ని పోషకాలను ఇవి కలిగి ఉంటాయి. వివిధ రకాల పండ్లు మరియు వాటి వలన శరీరానికి అందింపబడే వాటి పోషకాల గురించి తెలుపబడింది.

పండ్లు వల్ల ఆరోగ్యానికి కలిగే అత్యంత లాభాలు
తాజా పండ్లని తినటానికి ఎవరైన ఇష్టపడతారు. పండ్లని సలాడ్'గా, జ్యూస్'గా, రసాయనిక ద్రావాలుగా తీసుకుంటారు. పండ్లని ఎక్కువగా తీసుకోవటం వలన ఆరోగ్యంగా ఉంటాము. పండ్లు మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను మరియు రోగ నిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తాయి.

ఆపిల్
పురాతన సామెత చెప్పినట్టు “రోజుకి ఒక ఆపిల్ డాక్టర్ కి దూరంగా ఉంచుతుంది” అని అందరికి తెలిసిన నిజమే. రక్త ప్రసరణ వ్యవస్థలో నెమ్మదిగా చక్కెర స్థాయిలను విడుదల చేయటం వల్ల రక్తంలో 'ఇన్సులిన్' స్థాయిలను నియంత్రిస్తుంది. ఆపిల్ ఎక్కువగా ఫైబర్'ని కలిగి ఉండటం వలన శరీర బరువును సమన్వయపరుస్తుంది.

పోప్పడి పండు
పోప్పడి పండును దేవదూతగా అభివర్ణిస్తారు. పోప్పడి పండు ఎక్కువగా పోషకాలను , జీర్ణక్రియ ఎంజైమ్లను, మెడిసినల్స్ ఇంకా చాలా వైద్య పరమైన కారకాలను కలిగి ఉంది. ఇందులో జీర్ణక్రియ ఎంజైమ్'లను కలిగి ఉండటం వలన జీర్ణక్రియలో ప్రోటీన్స్'ని విచ్చిన్నం చేయును.

అరటి పండు
అరటి పండు చాలా పోషకాలని కలిగి ఉండటము వలన ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. రోజు అరటి పండు తినటం వలన గుండె పరిస్థితులను, అధిక రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా హృదయ స్పందలను నియంత్రిస్తూ, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మామిడి పండు
మామిడి పండు రుచికరంగానే కాకుండా, ఆరోగ్యకరమైన ఉపయోగాలను కలిగి ఉండటం వలన దీన్ని 'కింగ్ అఫ్ ఫ్రూట్స్'గా అభివర్ణిస్తారు. ఇది క్వేర్సిటిన్, ఐసోక్వేర్సిటిన్, ఆస్ట్రగాలిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొవ్వు పదార్థాలను సరియగు పాళ్ళలో వుంచి, చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది.

గ్రేప్స్ లేదా ద్రాక్ష పండ్లు
గ్రేప్స్ ఎక్కువగా విటమిన్ ‘A’, ‘C’, ‘B6’ మరియు ఫోలేట్'లను కలిగి ఉండటం వలన మలబద్దకం, అలసట వంటి ముత్రపిండానికి సంబంధించిన వ్యాధులను, మాక్యులర్-డిజెనరేషణ్, అజీర్ణం వంటి వాటికి చికిత్సగా వాడతారు. ఈ రుచికరమైన పండ్లు శరీరానికి కావలసిన మినరల్స్, పొటాసియం, కాల్షియమ్, ఐరన్, పాస్పరస్, మేగ్నేషియం, మరియు సెలీనియం వంటి చాలా రకాలయిన మూలకాలను కలిగి ఉంది.

లిట్చి
లిట్చి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. థయామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పుష్కలమైన 'B-కాంప్లెక్స్' విటమిన్స్'ని కలిగి ఉంటుంది. శరీరంలో సులువుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలను జీవక్రియలో ఏర్పడేలా చేస్తుంది.

జామపండు (Guava)
రక్తంలోని చక్కెర స్థాయిలను నెమ్మదిగా గ్రహించేల సహాయపడుతుంది. ఎక్కువగా ఫైబర్'ని కలిగి ఉండటం వలన డయాబెటిక్ వ్యాధులకు మంచి ఆహరం. రక్త పీడనాన్ని నియంత్రించటమే కాకుండా, థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయటానికి దోహదపడుతుంది.

పుచ్చపండు
పుచ్చపండు నమ్మలేని విధంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా సహజ సిద్దమైన డైయురేటిక్'గా పనిచేసి శరీరంలో నీటి మట్టాన్ని సమన్వయ పరుస్తుంది. ఇది తక్కువ క్యాలోరీలను కలిగి ఉండి, మరియు పూర్తిగా కొవ్వు పదార్థాలను కలిగి ఉండదు.

నేరేడు పండు
నేరేడు పండు ఎక్కువగా ఫైబర్ మరియు బీటా-కెరోటిన్'లను కలిగి ఉండును. కంటి, గుండె వ్యాధులను తగ్గించటానికి కావలసిన మూలకాలను కలిగిఉండును. ఆరెంజ్ రంగు కలిగిన ఈ పండు LDL కొలెస్టరాల్'ను ఆక్సిడేషన్ అవకుండా ఆపును, గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
Share This :

Related Postsentiment_satisfied Emoticon