దోసకాయ పల్లీ కర్రీ / Cucumber peanut curry


కావలసిన పదార్థాలు: 
 1. దోసకాయలు - చిన్నవి రెండు,
 2.  వేరుశనగ పల్లీలు - 100గ్రా,
 3. జీడిపప్పు - 50గ్రా, 
 4. చింతపండు - రెండు రెబ్బలు, 
 5. జీలకర్ర - ఒక టీస్పూను,
 6.  ఎండుమిర్చి - నాలుగు, 
 7. పచ్చి మిర్చి - నాలుగు,
 8. వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, 
 9. కొత్తిమీర తరుగు - ఒక టీస్పూను, 
 10. కరివేపాకు - రెండు రెమ్మలు.
తయారుచేసే విధానం: 
 1. కడాయిలో నూనెపోసి వేరుశనగ పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు దోరగా వేగించి మిక్సీ పట్టుకోవాలి. 
 2. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి. 
 3. ఓ గిన్నెలో చల్లారిన దోసకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న ముద్ద, చింతపండు గుజ్జు వేసి ముద్దగా కలుపుకోవాలి.
 4.  మరో కడాయిలో నూనెపోసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక కలిపి ఉంచిన దోసకాయ మిశ్రమాన్ని వేసి పదిహేనునిమిషాలు మూత పెట్టి ఉంచి కొత్తిమీర చల్లి దింపుకోవాలి. 
Share This :

Related Postsentiment_satisfied Emoticon