బేబీకార్న్, శెనెగల రైస్ / Babycorn Chickpeas (brown) rice


కావలసిన పదార్థాలు :
  1. ఉడికించిన అన్నం - రెండు కప్పులు, 
  2. ఉడికించిన శెనగలు - పావు కప్పు, 
  3. బేబీకార్న్ - ఆరు (నిలువుగా చీల్చి నాలుగు ముక్కలుగా కోయాలి),
  4.  ఉప్పు - రుచికి సరిపడా, 
  5. నూనె - రెండు టేబుల్ స్పూన్లు.
మసాలా కోసం:
  1. శెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్, 
  2. ఎండుమిర్చి - ఐదు, 
  3. ధనియాలు - అర టేబుల్ స్పూన్, 
  4. మిరియాలు - అర టీస్పూన్,
  5.  జీలకర్ర - అర టీస్పూన్, 
  6. నువ్వులు - ఒక టీస్పూన్.
తయారుచేసే పద్ధతి :
  1. శెనగల్ని ఒక రాత్రంతా లేదా వేడి నీళ్లలో ఒక గంట నానపెట్టాలి. 
  2. కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.బేబీకార్న్ను శుభ్రంగా కడిగి నిలువుగా చిన్న ముక్కలుగా కోసుకుని నీళ్లలో ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.
  3. అన్నం పలుకుగా ఉడికించి వెడల్పాటి పళ్లానికి నూనె పూసి అందులో పరవాలి. 
  4. పాన్ను వేడిచేసి మసాలా దినుసుల్ని వేగించి చల్లారాక పొడి కొట్టాలి.
  5. నాన్ స్టిక్ కళాయిలో నూనె వేడిచేసి ఉడికించిన శెనగలు, బేబీకార్న్ వేసి మూడు నిమిషాల పాటు వేగించాలి. 
  6. తరువాత ఇందులో మసాలా పొడి వేసి కలపాలి.
  7. ఉడికించిన అన్నాన్ని వేసి గరిటెతో కలిపి అవసరమనుకుంటే ఉప్పు వేయాలి. 
  8. అన్నం మీద కొన్ని నీళ్లు చల్లి మరో ఐదు నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉంచాలి. 
  9. కొత్తిమీర తరుగు వేసి, ఆ పైన క్యారెట్ తురుము కూడా చల్లుకుంటే బాగుంటుంది. 
  10. ఈ అన్నాన్ని కీరదోసకాయ రైతాతో తింటే వారెవ్వా అనాల్సిందే.
Share This :

Related Post



sentiment_satisfied Emoticon