Fish pakodi / ఫిష్ పకోడి

label

కావలసిన పదార్థాలు:
  1. చేపలు - 2
  2.  కోడిగుడ్లు - 2
  3. కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్
  4. కారం - ఒక టీ స్పూన్
  5. నిమ్మరసం - 2 స్పూన్
  6. కొత్తిమీర - ఒక కట్ట
  7. ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
  1. చేపలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
  2. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. 
  3. ఒక గిన్నెలో కోడిగుడ్లను బాగా గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. 
  4. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. 
  5. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి వేయాలి. 
  6. బంగారు వర్ణం వచ్చే వరకు వేయించి తీయాలి. 
  7. ఏదైనా చట్నీతో లాగిస్తే మరింత ఉంటాయి ఫిష్ పకోడీలు!
Share This :

Related Post



sentiment_satisfied Emoticon