అసలు ఈ మను స్మృతి అంటే ఏమిటి...?

Image result for హిందూ ధార్మిక గ్రంథఇది హిందూ ధార్మిక గ్రంథమా.లేదా ధార్మిక గ్రంథమా..? దీనిని హిందువులు పాటించాలా..? హిందువులు పాటించాలని నియమం ఏమైనా ఉందా...? ఇది ఈ కాలం లో పనికొస్తుందా..? దీనిని వేదఅధ్యయన కేంద్రాలు , వేద పాటశాలలలో బోధిస్తారా..? అందులో  పూర్తిగా చెడు మాత్రమే ఉందా...? మంచి కూడా ఉందా...? చెడు పాలు ఎక్కువ ఉందా ...? మంచి పాలు ఎక్కువ గా ఉందా..? ఒక వేల మంచి ఉంటె మంచిని కాదని కొన్ని చెడు వాక్యాలను చూపించడం లో ఉద్దేశ్యం ఏమిటి...? మనుస్మృతి నుండి ప్రస్తుత సమాజం నేర్చుకోవడానికి ఏమైనా ఉన్నాయా..?మనుస్మృతి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు...?
*మనుధర్మ శాస్త్రం ఒక పరిశీలన*
వర్ణ వ్యవస్థను గురించి మనువు అభిప్రాయం ఏమిటో చూద్దాం.....!
ఒక అద్భుత ప్రపంచాని ఊహించిన దార్శనికుడు మనుమహర్షి. నేడు కులాలుగా విడివడి కొట్టుకుంటున్న సమాజాన్ని మనువు ఊహించలేదు. అందరికీ సమానమైన, అందరికీ ఆమోదయోగ్యమైన, అందరికీ అర్హతను బట్టి సమాజ విభజన జరిగింది. *పుట్టుకతో వర్ణం కాదు. గుణంతో వర్ణాన్ని వారు వర్గీకరించారు.* ఇక పంచమ అనే వర్ణం అనేదేలేదు.
శ్రీరామ చంద్రుడికి అత్యంత సన్నిహితుడైన మిత్రుడు గుహుడు. గుహుడు పల్లెకారుడు. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీరాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది. మహాభారతంలో దాసీ పుత్రుడైన విదురుడు మంత్రి. మన చరిత్ర తిరగేస్తే అనేకమంది శూద్రులు రాజ్యాలు పాలించినట్లు అర్థం అవుతుంది. మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివాడు. మన తెలుగు భాషకు పట్టంగట్టిన శ్రీకృష్ణదేవరాయలు బలిజ, మన భారత జాతికి అధ్భుత ఆధ్యాత్మిక విద్యనందించిన శ్రకృష్ణుడు గొల్లవాడు, మౌర్యసామ్రాజ్యాన్ని నేలమట్టంచేసి గుప్తసామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడు వైశ్యుడు. చాణుక్యుడుగా ప్రసిద్దిగాంచిన అర్థశాస్త్ర ప్రవర్తకుడు విష్ణుగుప్తుడు వైశ్యుడు. ఇలా చెప్పుకుంటూపోతే భారతదేశాన్ని నేడు శూద్రులనేవారే పరిపాలించారు. శూద్రశబ్దాన్ని చాలా నీచంగా చిత్రీకరించారు నేటి మహానుభావులు. మరొక్కవిషయం నాకు చెప్పాలనిపిస్తుంది. విశ్వకర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాఈబ్రాహ్మలు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
శూద్రుల గురించి మనువేం చెప్పాడో చూద్దాం.
శూద్రులు అంటరానివారు కారు
మనువు శూద్రులను అంటరానివారుగా, నిందిపదగినవారుగా, అసహ్యించుకొన దగినవారుగా చెప్పాడని కొంతమంది ప్రచారం చేస్తుంటారు.
ఇది దుష్టప్రేలాపన . శూద్రుడు ఆర్యుడు...సమర్థుడు గౌరవింపదగినవాడుగా మనువు పరిగణించారు.
ముఖ బహూరుపజ్ఞానాం యాలోకే జాతయో బహిః
మ్లేచ్ఛ వాచశ్చార్యవాచః సర్వే తే దస్యవః స్మృతాః
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాలకంటే భిన్నమైనవారు, మంచి కర్మలు చేయనివారు మ్లేచ్చులు వీరిని దస్యులు అని పిలవాలి.
ద్విజుల ఇళ్ళలో పనిచేసే శూద్రులు శ్రమ చేస్తారు కాబట్టి యజమాని వారికి ముందు భోజనం పెట్టి తరువాత తాము తినాలని ఆదేశించారు. మహర్షి మనువు శూద్రులను ఉత్తములు, ఉత్కృష్టులు, శుచులు అని విశేషగుణాలతో పొగిడాడు. ద్విజుని గృహానికి శూద్రుడు అథిధిగా వస్తే అతనికి భోజనం పెట్టి ఆదరించాలని ద్విజులను నిర్థేశించారు.
భుక్తవత్స్వథ విప్రేషు స్వేషు భృత్యేషు చైవ హి
భుంజీయాతాం తతః పశ్చాత్ అవశిష్టం తు దంపతీ.
విద్వాంసులైన అతిధులు భుజించిన తర్వాత, తమ సేవకులు భుజించిన తర్వాత మిగిలిన భోజనం దంపతులు-గృహస్తులు భుజించాలి.
నేటి సభ్యసమాజం తమకంటే ముందు పనివారికి భోజనం పెడుతుందా. ఇంత శ్రద్దగా పనివారిని చూసుకుంటారా. ఇది మానవత్వానికి మహోన్నతరూపం. ఉన్నత వర్గాల ఇళ్ళలో పనులు వంటలు కూడా శూద్రులే చేస్తారు. మరి వారు అస్పృశ్యులు ఎలా అయ్యారు..
స్త్రీల వివాహం విషయంలో మహర్షి కి ఆదర్శభావాలున్నాయి. కన్యలు తగిన వరుని స్వయంగా వరించే అధికారాన్ని కల్పించారు. స్వయంవరం చేసుకునే అధికారాన్ని, స్వతంత్రాలను ఇచ్చారు. మనకు సీతా స్వయంవరం ఇందుకు మంచి ఉదాహరణ.
త్రీణి వర్షాణి ఉదీక్షేత కుమార్యుతుమతీ సతీ
ఉర్థ్వంతు కాలాదేతస్మా ద్విన్థేత సదృశం పతిమ్ (మను స్మృతి 9-90)
కన్యకు వివాహం చేసుకోవాలనే కోరిక కలిగినప్పుడు, రజస్వల అయిన 4 సంవత్సరాలపైన నే వివాహం చేసుకొవచ్చును.
విధవాస్త్రీలు పునర్వివాహం చేసుకొనుటకు కూడా అధికాం ఇచ్చాడు మను మహర్షి.
న కన్యయాః పితా విద్వాన్ గృహ్ణైయాచ్చుల్క మణ్వపీ
గృహ్ణం చ్ఛుల్కం హిలోభే చ స్యాన్నరో2పత్య విక్రయా
బుద్దిమంతుడైన కన్య తండ్రి కన్య వివాహవిషయంలో కొంచెంకూడా ధనం తీసుకో కూడదు. లోభంయై ధనం తీసుకుంటే అతడు సంతానాన్ని అమ్ముకున్నవాడుగా పరిగణించాలి.
ఈవిధంగా మహర్షి కన్యాశుల్కం, వరకట్నం రెండింటినీ నిషేధించారు.
కామమా మరణాత్తిష్ఠేద్ గృహే కన్య ర్తుమత్యపి
నచైవైనాం ప్రయచ్ఛేత్తు గణ హీనాయ కర్హిచిత్.
కన్య మరణించేంత వరకూ కుమారిగానైనా ఉండవచ్చుగానీ, గుణహీనునికిచ్చి మాత్రం వివాహం చేయరాదు.
సర్వగుణ లక్షణఅయిన కన్య నీచుల ఇంట పుట్టినా అద్భుతమైన మణిగా భావించి ఆకన్యను స్వీకరించమని మనువు ఆదేశం.
స్త్రీల పట్ల మహర్షికున్న ఇంత అవగాహన, గౌరవం కనిపిస్తూఉంటే. ఆమహర్షిని నిందించడం అమానుషం. అదీ స్త్రీలు, స్త్రీవాదులు నిందించండం. మరీ దారుణం.
శూద్ర వాదం గురించి.
స్త్రీల పై జరిగే అత్యాచారాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉండేవో చూద్దాం.
స్త్రీలను హత్యచేయడం , అపహరించడం, వంటి దుష్కర్మలు చేసేవారికి మరణశిక్షను విధించాలి. అత్యాచారాలకు పాల్పడడం, బలాత్కారంచేయడం లాంటి దుష్కర్మలకు యాతనలతోకూడిన శిక్షలతో పాటు దేశబహిష్కరణ విధించాలి అని శాశించాడు.
పురుషాణాం కులీనానాం నారీణాంచ విశేషతః
ముఖ్యానాంచైవ రత్నానాం హరణే వధమర్హతి.
శ్రేష్టపురుషులను, విశేషించి స్త్రీలను అపహరించినపుడు, వజ్రవైడూర్యాలను, రత్నాలను అపహరించినపుడు అపహరించినవారిని వధించాలి.
మాతాపితృభ్యాం జామీభిః బ్రాత్రా పుత్రేణ భార్యయా
దుహిత్రా దాసవర్గేణ వివాదం న సమాచరేత్
తల్లి, తండ్రి, తోబుట్టువులు, సోదరులు, భార్య, కుమార్తెలు, సేవకులతో తగాదాలు పెట్టుకోకూడదు.
ఈ రకంగా స్త్రీల జీవితాలలో సంభవించే ప్రతి చిన్న సమస్య.నూ దృష్టిలో ఉంచుకుని మనువు పరిష్కారాలు శిక్షలు నిర్ధారించాడు.
ఈనాడు ఇంత రక్షణ స్త్రీలకు ఉందేమో ఆలోచించండి. నిర్బయ చట్టం వచ్చిన తరువాత ఎంతమంది అత్యాచారాలకు గురి అయ్యారో గమనించండి. స్త్రీలపై అత్యాచారాలు చేసేవారికి ఎంతమందికి శిక్షలు పడ్డాయో ఆలోచించండి.
న ధర్మాత్ షేధనమ్ (మనుస్మృతి 10-126)
శూద్రునకు ధర్మకార్యాలు చేయడంలో నిషేధంలేదు.
కార్షాపణం భవేద్థండ్యో యత్రాస్యః ప్రాకృతోజనః
తత్ర రాజా భవేద్దండ్యః సహస్రమితి ధారణా
ఒక అపరాధంలో సాధారణ మనుష్యునికి ఒక కార్షాఫణం దండన విధిస్తే అలాంటి అపరాధాన్నే చేసిన రాజుకు 1000 కార్షాఫణాల దండన విధించాలి.
మరి రాజుకే యింత దండన ఉంటే బ్రాహ్మణునకెంత దండన ఉండాలో ఆలోచించండి. శూద్రునకు తక్కువ దండన విధించాడు మనువు. శూద్రునకు అధిక దండన అనేది మద్యలో ప్రక్షిప్తం అనేది అర్ధం అవుతుంది కదా. ఇంకొక శ్లోకం చూద్దాం.
అష్టాపాద్యం తు శూద్రస్య స్తేయే భవతి కిల్బిషమ్I
షోడశైవ తు వైశ్యస్య ద్వాత్రంశత్ క్షత్రియస్యచII
భ్రాహ్మణస్య చతుః షష్ఠిః వూర్ణం వా అపి శతం భవేత్I
ద్విగుణావా చతుః షష్ఠిః తద్ధోషగుణః విద్ధి సఃII
దొంగతనం మొదలైన అపరాధాలలో శూద్రునకు 8రెట్లు దండన విధిస్తే, వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు బ్రాహ్మణునకు 64 లేక, 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనువు ఆదేశించారు. *శిక్షల విషయం లో ప్రక్షిప్త శోకాలు కనిపించిన మహానుభావులకు ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలోదో విజ్ఞులైన మీరు గ్రహించగలరను కుంటాను*.
*స్త్రీ, శూద్రుల విషయం లో ప్రక్షిప్త శ్లోకాలు ఎవరు ప్రక్షిప్తం చేశారో, ఎందుకు చేశారో మీరీపాటికి గ్రహించి ఉంటారు. మన సమాజాన్ని చీల్చడానికి పన్నిన కుట్ర విభజించి పాలించడం స్పష్టంగా కనిపించడంలేదా. మెకాలే ఆంగ్లవిద్యనేర్చిన విద్వాంసులకు, బానిస బుద్ది కాక ఇంకేం అలవడుతుంది. ఆంగ్లేయుల కుట్రను ఇంకెప్పటికి మనం గ్రహిస్తాం. స్వాభిమాన భారతాన్ని ఎప్పటికి మనం నిర్మించుకుంటాం.*
కొన్ని వేల కులాలుగా సమాజాన్ని చీల్చడం మేలో నాలుగు వర్ణాలు గా విభజించి ఒకరికొకరు గౌరవించుకుంటూ బ్రతకడం మేలో ఆలోచించండి.
“మనుస్మృతి” ఈ పేరు వినగానే హిందూ ధర్మ విమర్శకులకి ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొస్తుంది.కారణం వారి అవసరాలయిన మత వ్యాప్తి ని ఈ గ్రంధం లో ఉన్న కొన్ని అవసరమ లేని వాక్యాలు ద్వారా ఇంకొంత పెంచుకోవచ్చు..! హిందువులకు కులపిచ్చిని ఆపాదించి కోన్ని వర్గాలను అన్యుల పేరుతో, అంటరాని వారని ఈ ధర్మానుసారం కలియుగానికి పనికి రాదని త్యజించబడిన గ్రంధం లో లేని పోనీ అర్ధాలను చూపి కొందరిని హిందూ మతానికి దూరం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం...!
*మనుస్మ్రితి అంటే ఏమిటి...? ఇది హిందూ ధార్మిక గ్రంథమా..? ఆధ్యాత్మిక గ్రంథమా..? ధర్మ శాస్త్రమా..?*
*మనుస్మృతి పురాతనమైన(ఇప్పటికి అవసరం లేని ) క్రుతయుగానికి చెందిన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి...ఇది ధార్మిక గ్రంధం కాదు...ఆధ్యాత్మిక గ్రంధం కానే కాదు...దీనికి వేదాలకు సంభందం లేదు .. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని అందురు. దీనిని మనువు అప్పటి కాలానికి (క్రుతయుగానికి)అనుగూనం గా రచించాడు. 'మనుస్మృతి ని మొదటిసారిగా 1974లో సర్ విలియమ్ జోన్స్ అను అంగ్లేయుడు ఆంగ్లంలో తర్జుమా చేశాడు.మొదట తర్జుమా చెయ్యబడిన హిందూ ధార్మిక గ్రంధం కూడా ఇదే.. ఒక సంస్కృతం రాని ఆంగ్లేయుడు, పైగా అన్యమతస్థుడు దీనిని తర్జుమా చేసాడంటే అందులో ఒకదానికి ఇంకొకటి అర్ధం కాక రాసి ఉండొచ్చని,లేదా హిందూ సమాజాన్ని పెడదోవన పట్టిద్దామని చేసాడేమో అని చదువుకున్న ప్రతి ఒక్కడికి వచ్చే సందేహం..'*
.!!ధరతిలో కానితి హ ధర్మః !! !!ద్రియజే జనైరితి ధర్మః !!
అంటే లోకములను ఉద్ధరించేదానిని ధర్మము అంటారు,జనులచే ధరి౦పబడేది ధర్మము వీటినే మరో విధంగా సమన్వయము చేస్తే ధర్మాచరణ వల్లే లోకం నిలిచి ఉన్నదని ,అట్లాగే మానవ స్థితిగతులకు ధర్మమే మూలమని స్పష్టమవుతున్నది అలాంటి ధర్మానికి మూలం వేదం .అందుకే వేదో ధర్మ మూలం అని చెప్పబడింది “విద్” శబ్దానికి జ్ఞానం అని అర్ధం వస్తుంది...ధర్మాధర్మా పరిజ్ఞానం కలిగించేది కనుకనే వేధమని ,ధర్మాధర్మాదులు దీని ద్వారా తెలియజేయబడతాయి కనుకనే “శృతి” అని ధర్మాఆధార్మాలు తరతరాలుగా అభ్యసించబడుతున్నాయి కనుక “ఆమ్యాయ” మని వేదాలకు పేర్లు అంటే ...ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించేది వేదం మాత్రమె అని స్పష్టమవుతుంది ఈ విషయాన్ని మనుస్మృతి కూడా తెలియజేస్తుంది కావాలంటే నిరూపిస్తాను చూడండి “వేధోఖిలో ధర్మం మూలం(2-6) “సర్వోభి హితో వేదో “(2-7) “ధర్మఎవాహతో హ౦తి “ ధర్మో రక్షతి రక్షితః)(8-15) లో మాత్రమె కాక అనేకచోట్ల చెప్పబడుతుంది..
మనిషి మనిషి గా బ్రతకడానికి , మనిషి గా ఎదగడానికి ముఖ్యమైన ధర్మాన్ని ప్రభోదించిన వాటిలో వేదం తరువాత మొదట చెప్పదగినవి ధర్మశాస్త్రాలు ఆ ధర్మ శాస్త్రాలలో మొదటిది మనుస్మృతి గాని ఆఖరిది కాదు..యుగయుగాలలోనూ మారుతున్న కాలం దృష్ట్యా మునులు ధర్మ శాస్త్రాలు మారుతూ వచ్చాయి ..
క్రుతేతు మానవాః ప్రోక్తః
త్రేతాయాం గౌతమ స్మృతి:
ద్వాపరే సంకర లికితౌ
కలౌ పరాశర స్మ్రుతి :
అన్న శ్లోకం ఇదే విషయాన్ని చెప్తుంది ...కృతయుగం లో మనుస్మృతి పరమ ప్రామాణికం గా చెప్పబడుతుంది అట్లాగే త్రేతాయుగం లో గౌతమ ధర్మ శాస్త్రం ,ద్వాపర యుగం లో శ౦ఖ లిఖిత స్మృతి ప్రామాణికములు , ఈ కలియుగం లో పరాశరస్మృతి ప్రామానికములుగా ఉన్నదని దీని అర్ధం ...ఈ శ్లోకం మను స్మృతి ప్రామాణికాన్నే కాక ప్రాచీనతను కూడా తెలుపుతుంది అంతే గాక మారుతున్న కాలాన్ని బట్టి మిగతా కొన్నిమత గ్రందాల లాగా కాకుండా హైందవం మార్పు చెందగలదని మనకు తెలుస్తుంది....
జై సనాతన ధర్మం ...
Share This :

Related Postsentiment_satisfied Emoticon