తాళిబొట్టు / మాంగల్యం

Image result for తాళిబొట్టు / మాంగల్యం

దౌర్భాగ్య పరిస్తితి ఏమిటంటే మన హిందూ సోదరీమణులు నవీనత పరాకాష్ట కి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం. సినిమాలు టీవీ ల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. ఎక్కువ శాతం కనిపిస్తున్న లేదా మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్ర గణాల నుండి వచ్చే వాట్శాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటో లు అన్ని ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాల అరిష్టం.


“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!”
పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.
“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం”
ఓ! సుభగా నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు అంటే పుణ్యస్త్రీగా ముత్తయిదువు గా జీవించు అని స్పష్టము గా తెలుస్తున్నది.
పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, ధగ్గులు వంటి కిరాత జాతులవారు వలసవచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు తను వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు అంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.
పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజ గ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.
ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున
కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వసాధారణమైపోయింది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభఫలితాలు సమకూర్చగలవు.

పాశ్చాత్య, అనుకరణ వెర్రి లో ఊగుతున్న మన ఆడ కూతర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం.
వ్యక్తపరిచిన విషయాలు పాటెల్ నారాయణ రెడ్డి గారు రాసిన ఆచారాలు సంప్రదాయాలు, కంచి పరమాచార్య పధం పుస్తకాల నుండి కొంత స్వయం గా గ్రహించి రాసినవి. ఏమైనా తప్పులుంటే పెద్దలు సరిదిద్ది మన్నించగలరు.
సర్వం పరమేశ్వర పాదారవిన్దార్పనమస్తు !
Share This :

Related Postsentiment_satisfied Emoticon