వైకుంఠ ఏకాదశి ఉపవాస విశేషాలు.

ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు.

మన ధర్మ శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏకాదశి నాడు అన్నంలో పాపాలు ఉంటుందని, అందువల్ల ఆ రోజు ఉపవసించాలాని తెలుస్తున్నది.

జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది.

మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురుగిపోయి రోగాలకు కారణమవుతుంది. ఇది విషపదార్ధం. ఈనాటి శాస్త్రం దీనిని toxins అంటుంది. వీటివల్లనే మనిషికి 90% రోగాలు వస్తున్నాయి. ఈ toxins ను ఆయుర్వేదంలో ఆమం అంటారు,దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలంటారు. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది. అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70ఏళ్ళ వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్ప్లులు కూడా వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవసించాలని ఆయుర్వేదం చెప్తోంది.

దశమి నాడు ఉదయమే లెచి శిరస్నానం చేసి, ఏకాదశి వ్రతం చేస్తున్నానని పరమాత్మ ముందు చెప్పుకుని, పూజ చేసి, భోజనం చేసి, ఆ రాత్రికి ఉపవసించాలి. ఫలహారం తీసుకోవచ్చు. ఏకాదశి నాడు తలకు ఎటువంటి నూనెలు, ష్యాంపులు పెట్టకుండా కేవలం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి. విష్ణు పూజ చేయాలి. ఉపవాసం చేయాలి. ఆ రాత్రి విష్ణు నామాలతో జాగరణ చేసి మరునాడు అంటే ద్వాదశి నాడు ఉదయం తలారనీటిని పోసుకుని స్నానం చేయాలి. అభ్యంగన స్నానం ఏకాదశి,ద్వాదశి తిధులలో నిషిద్ధం. స్నానం తరువాత విష్ణు పూజ చేసి, ఉదయం ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, పారణ(భోజనం)చేయాలి. ఆ రాత్రికి కేవలం ఫలహారం మాత్రమే తీసుకోవాలి.

ఏకదశి ఉపవాసం వలన ఆరోగ్యం లభిస్తుంది. వివాహం జరిగిన వారందరూ తప్పకుండా ఉపవాసం చేయాలి. బ్రహ్మచారులకు, రోగులకు, 80 ఏళ్ళకు పైన వయసున్నవారు ఉపవసించవలసిన అవసరం లేదు. శ్రీ మహా విష్ణువును ఆరాధించినా చాలు.

ఇందులో చాలా అరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇదంతా మన ఆరోగ్యం కోసం ఆ పరమాత్మ చేసిన శాసనం.
ఆచరిద్దాం. తరిద్దాం. ఆనందిద్దాం.మనశ్శాంతిని,తద్వార పరమగతిని పొందుదాం.

ఓం నమో లక్ష్మీనారాయణాయ

Share This :

Related Postsentiment_satisfied Emoticon