బ్రాండెడ్ గోధుమపిండిలో ప్లాస్టిక్ కలుపుతున్నారా....ఎది నిజం...


అవునా…? నిజమేనా..? బ్రాండెడ్ గోధుమపిండిలో ప్లాస్టిక్ కలుపుతున్నారట ఆంటీ..? ఏమోనమ్మా… ఏమీ నమ్మలేకపోతున్నాం సుమీ… కలికాలం, పిండిలో ప్లాస్టిక్ కలుపుతున్నారట, వీళ్లు నాశనమైపోను, వీళ్ల చేతులు విరిగిపోను… ఇలాంటి సంభాషణలు ఈమధ్య మళ్లీ పెరిగిపోయాయి… వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, యూట్యూబ్ వీడియాల్లో ఒకటే హల్ చల్… అవును, పైపైన చూస్తే మనకూ భయం వేయడం సహజమే కదా…
అసలే ఆమధ్య ప్లాస్టిక్ రైస్ గురించి నానా ఫేక్ న్యూసూ ప్రచారం చేసి వదిలిపెట్టారుగా… చివరకు సాక్షి వంటి పత్రిక కూడా ఆ ప్రచారాలకు పేజీలకొద్దీ స్పేస్ కేటాయించిన తీరు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బోలెడు ప్రచారం చేసిన తీరు చూశాం కదా… మన ఖర్మ బాగుండి, ఆ ప్రచారాలు ఆగిపోయాయి… జనం కాస్త నిర్భయంగా అన్నం తింటున్నారు ఈమధ్యే… ఇక ఇప్పుడు గోధుమపిండి గురించి…. ఏమనీ..? గోధుమపిండిలో ప్లాస్టిక్ గురించి…!
ఒకడు ఎవడో ఆశీర్వాద్ గోధుమపిండి గురించి ఇలాంటి ప్రచారం మొదలుపెట్టాడు… బహుశా ఇది పతంజలి వాడి కుట్రేమో అనుకుని ఇంకొందరు ఏకంగా పతంజలి గోధుమ పిండిపైనా ఇలాంటి వీడియోలే రిలీజ్ చేశాడు… ఇవే కాదు… కొన్నేళ్లుగా ఉన్న ప్రచారమే ఇది… ఉత్త ఫేక్… రకరకాల బ్రాండ్ల గోధుమపిండి తీసుకోవడం, చూశారా, చూశారా… ఈ కంపెనీలు ప్లాస్టిక్ కలిపేస్తున్నారు అంటూ ప్రచారాలు… జనం వాటిని చూసి, హడలిపోయి, చపాతీలు తినాలంటేనే వాంతి చేసుకునే దుస్థితి… అసలే సుగర్ పేషంట్లం, ఇక చపాతీలూ నిర్భయంగా తినలేకపోతే ఎట్లారా బాబూ అంటూ వణికిపోవడం… బాబ్బాబూ… మా గోధుమపిండి సొక్కం… అని సదరు కంపెనీలు ఏం చెప్పినా, ఎంత చెప్పినా వినేవాడేడి..?
అలాంటి వీడియోలు మళ్లీ ఇక్కడ పోస్టు చేసి, మీ టైం హరించే ఉద్దేశం మాకేమీ లేదు… మిమ్మల్ని భయపెట్టడం అసలే ఇష్టం లేదు… కానీ నిజం చెప్పాలి కదా… అదే ఈ కథనం…. మీరు స్వయంగా వ్యవసాయ మార్కెట్ వెళ్లి, గోధుమలు కొని, మరాడించి, జల్లించి, ప్యూర్ గోధుమ పిండి తయారు చేసుకున్నా సరే… ఆ గోధుమపిండిలో 88 నుంచి 92 శాతం వరకూ స్టార్చ్…. పిండిపదార్థాలు… కార్బోహైడ్రేట్స్ ఉంటాయి… అది బ్రాండెడ్ గోధుమపిండి బయటి మార్కెట్‌లో తెచ్చుకున్నా సరే… అలాగే ఉంటుంది… కాకపోతే ధర ఎక్కువ… అయితే మరి మిగతా పదార్థం…? 100 గ్రాముల గోధుమపిండి తీసుకుంటే అందులో 8 నుంచి 12 శాతం వరకూ ప్రొటీన్లు ఉంటాయి… అందులో ముఖ్యమైనది గ్లూటెన్… మనం గోధుమపిండికి నీళ్లు కలిపి, రొట్టెలకు పనికొచ్చే పిండిలా తయారు చేసినప్పుడు అందులో కనీసం పది శాతం గ్గూటెన్ ఉంటుంది… అది ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటుంది… మరీ సింపుల్‌గా చెప్పాలంటే రబ్బరులా ఉంటుంది… సాగే గుణం మాత్రమే… అంతేతప్ప అది ప్లాస్టిక్ కాదు, రబ్బరు కాదు… బయటి పదార్థమేదో కలిపినట్టు కూడా కాదు… ఇదీ అసలు కథ… కొన్ని బ్రాండెడ్ కంపెనీలు మాది మైదా ఫ్రీ అని ప్రచారం చేసుకుంటాయి… అంతేతప్ప గ్లూటెన్ ఫ్రీ అని ఏ కంపెనీ చెప్పుకోదు… గ్లూటెన్ వద్దూ అనుకుంటే గోధుమపిండి అవాయిడ్ చేసి, జొన్న, సజ్జ, రాగి పిండి ఆశ్రయించాల్సిందే… చాలా వీడియోల్లో కనిపించేది ఏమిటీ అంటే..? కొంత గోధుమ రొట్టెల పిండి తీసుకుని, ఆ స్టార్చ్ అంటే, పిండిపదార్థం పోయేదాకా నీళ్లలో తడిపి వడబోస్తారు… తరువాత మిగిలేది గ్లూటెనే కదా… దాన్ని చూపించి, దాన్ని సాగదీస్తూ ఇదీ ప్లాస్టిక్ అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంటాయి… సో, ఆ వీడియోలు చూసి…. చపాతీలు తినటానికి వణికిపోకం
Share This :

Related Postsentiment_satisfied Emoticon