నాచురల్ టిప్స్‌....


నాచురల్ టిప్స్‌....
1. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలపాలి. అప్పుడు వచ్చే మిశ్రమాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి వెంటనే తాగేయాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తనాళాల వాపులను తగ్గించి రక్త సరఫరా పెంచే గుణం అల్లంలో ఉంది. అందుకే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.


2. మూడు టేబుల్ స్పూన్ల పెప్పర్‌మెంట్ ఆయిల్‌ను ఒక టేబుల్ స్పూన్ నీరు లేదా బాదం నూనెలో కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని నుదుటితోపాటు మెడపై కూడా మర్దనా చేయాలి. ఇలా చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.
3. పుదీనా ఆకులను బాగా నలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని నుదురు, మెడపై మర్దనా చేసినా ఫలితం ఉంటుంది. తలనొప్పి తగ్గుతుంది.
4. దాల్చిన చెక్కను తీసుకుని పొడి చేయాలి. దాన్ని నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను నుదురు, కణతలు, మెడకు పూర్తిగా రాయాలి. అనంతరం 30 నిమిషాలు ఆగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
5. రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ను నుదుటిపై ఐప్లె చేసి మసాజ్ చేస్తున్నా తలనొప్పి తగ్గిపోతుంది. అయితే ఇలా రోజుకు కనీసం 3 సార్లు చేయాలి.
6. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో రెండు చుక్కల లవంగం నూనె, కొద్దిగా సముద్రపు ఉప్పు కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని నుదుటిపై రాసి కొంత సేపు ఉంటే చాలు. తలనొప్పి తగ్గిపోతుంది.
cloves
7. కొన్ని లవంగాలను పొడి చేసి ఆ పొడిని గుడ్డలో కట్టి దాన్ని పదే పదే వాసన పీల్చాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
8. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ ద్రవంలో కొద్దిగా తేనె కలిపి తాగాలి. దీంతో తలనొప్పి సమస్య పోతుంది. తులసి ఆకులను కొన్ని తీసుకుని అలాగే పచ్చిగా నమిలినా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
9. యాపిల్ పండును ముక్కల్లా కోసి వాటిపై కొంత ఉప్పు చల్లి తిన్నా తలనొప్పి పోతుంది. అనంతరం వేడి నీళ్లు తాగడం మరిచిపోవద్దు.
Share This :

Related Postsentiment_satisfied Emoticon