విజేతల లక్షణాలు మీరు అలవాటు చేసుకోండి .. విజేతలు కండి

*విజేతల లక్షణాలు మీరు అలవాటు చేసుకోండి .. విజేతలు కండి* 

*1 ) విజేతలు ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు* ‍
ఇది సక్సెస్ కావాలి అని ప్రతి ఒక్కరికి ఉండవలసిన మొదటి లక్షణం. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. దీనికి ఎలాంటి age, gender అవవసరం లేదు. మనం నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేర్చుకోవటం ఎప్పుడు ,మానకండి .జీవితం మనకు ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తున్నే ఉంటుంది.మీరు ఎంత నేర్చుకుంటే అంత గొప్పవారు అవుతారు.
*2) విమర్శలకు భాదపడరు, భయపడరు*
పని చేయడం కష్టం ..కాని విమర్శించడం చాలా సులువు. మీరు ఏదన్నా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఏమన్నా పటించుకోకండి. వాళ్ళు అనేది వినండి నచ్చి , మంచి ఉంటే స్వికరించండి.
ఎప్పుడు ఇతరులు ఏమనుకుంటారో ,వాళ్ళు నన్ను హేళన చేస్తారేమో, నా సిగ్గు తెసేస్తరేమో అని భయం. ఒక విషయం గుర్తుంచుకోండి. నువ్వు ఈ పని చేసిన చేయకపోయినా ఎవరో ఒకరు ఎదో ఒకటి అంటూనే ఉంటారు. ఉదాహరణకు ఎక్కువగా నవ్వితే పిచ్చివాడు అంటారు, నవ్వకపోతే ఎప్పుడు కోపంగా ఉంటాడు, ఏడిస్తే పిరికివాడు అంటారు, ఏడవక పోతే వీడికి అసలు మనస్సే లేదు అంటారు,  మర్యాదగా ఉంటే అమాయకుడు అంటారు,  జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు, ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు, అందరితో తిరిగితే తిరుగుబోతూ అంటారు, ఎదేమైతే నాకేంటి అనుకుంటే స్వార్ధపరుడు అంటారు .ఇలా ఏ పని చేసిన చేయకపోయినా ఎదో ఒకటి అంటునే ఉంటారు.మరి వాళ్ళ గురించి ఆలోచించడం అవసరమా ??మీకు మీరు ప్రశ్నించుకోండి??  లేకపోతే అసలు పటించుకోకండి. కొత్త వారిని అడిగి ఏదన్నా తెలుసుకోవాలంటే భయం ఎందుకు ?? వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయం. అలాగే వాళ్ళు అనుకుంటారు.చివరికి ఇద్దరు భాదపడతారు. ఏదన్నా తెలియక పోతే అడిగి తెలుసుకోండి, తప్పులేదు. భాదపడుతూ ఎప్పుడు ఉండకండి. ప్రతి విమర్శను పాజిటివ్ గా తీసుకోండి.
*3) విజేతలు ఒకరిని follow అవ్వరు, వాళ్ళు లీడర్స్ గా ఉంటారు*
మనల్ని మనం వాడుకోకపోతే పక్కవాడు మనల్ని వాడుకుంటాడు. మన time ని మనం వాడుకోకపోతే మన time ని పక్క వాడు వాడుకుంటాడు. విజేతలు ఎప్పుడు ఒకరిని follow అవరు . వాళ్ళు initiative తీసుకుంటారు. వాళ్ళు risk’s తీసుకోవడానికి వెనుకాడరు. సో , మీరు విజేతలు కావాలంటే లీడర్స్ గా మారండి. risk’s  తీసుకోవడానికి భయపడకండి
*4 ) విజేతలు సలహాలు తీసుకోవడానికి భయపడరు* 
మనలో చాలా మందికి కొత్త వారిని అడిగి ఏదన్నా తెలుసుకోవాలంటే భయం ఎందుకు ?? వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయం. అలాగే వాళ్ళు అనుకుంటారు. చివరికి ఇద్దరు భాదపడతారు. ఏదన్నా తెలియక పోతే అడిగి తెలుసుకోండి, తప్పులేదు. భాదపడుతూ ఎప్పుడు ఉండకండి. సలహాలు అడగడానికి ,తీసుకోవడానికి భయపడకండి. EGO అలాంటివి దూరం పెట్టి status ని వదిలేసి ఎవరు మంచి సలహా ఇచ్చిన తీసుకొండి, ఇవ్వండి ,అడగండి
*5 ) వాళ్ళని వాళ్ళు ఎప్పుడు మోసగించుకోరు*
ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన మనస్సు మనకు ఒక మాట చెప్తుంది. నువ్వు మంచి చేస్తున్నావ్  అని లేదా తప్పు చేస్తున్నావ్ అని. మీ మనస్సుకు నచ్చని పనిని మీరు ఎప్పుడు చేయకండి. విలువలు, సంప్రదాయాలను ఫాలో అవండి. మిమల్ని మీరు ఎప్పుడు మోసగించుకోకండి.
*6 ) విజేతలు ఎప్పుడు comfort zone లో ఉండరు*   విజేతలు కావాలంటే first comfort zone నుంచి బయటకు రండి. comfort zone ఎప్పుడు హాయిగా సుఖంగా ఉంటుంది. అలాంటి stage లో మనలో ఎలాంటి development ఉండదు. risk’s తీసుకోండి. ప్రతి అనుభవాన్ని స్వికరించండి . వాటి నుంచి నేర్చుకోండి. ఒక విషయం గుర్తుంచుకోండి. _risk తీసుకోకపోవడమే జీవితంలో అతి పెద్ద risk_
*7 ) నెగటివ్ గా  మాట్లాడే వారితో ఎక్కువగా ఉండరు*
మీరు కూడా నెగటివ్ గా మాట్లాడే వారితో ఎక్కువగా ఉండకండి. వాళ్ళు ఎప్పుడు మనల్ని డి మోటివేట్ చేస్తుంటారు. ఈ పని మొదలు పెట్టిన ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి మీ చుట్టూ ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళతో ఉండండి. నెగటివ్ గా మాట్లాడే వాళ్ళ మాటలు పెద్దగా పటించుకోకండి.
✨గతం గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రస్తుతం మరియు భవిష్యతు గురించి ఆలోచించండి. పాత ఓటములను వదిలిపెట్టి కొత్త గెలుపు కోసం అవకాశాలను వెతకండి. చేసే పని మీద దృష్టి పెట్టి ఇతర విషయాలను దూరంగా పెట్టండి.*
Share This :

Related Postsentiment_satisfied Emoticon