ఈ పూజ పదార్థాల పరమార్థం ఏమిటి..?

ఈ పూజ పదార్థాల పరమార్థం ఏమిటి..? 
పూజ                                                                  అర్చన                                                            జపం.                                 
స్తోత్రం.                                                                   ధ్యానం.                                                               దీక్ష.                                                                                 అభిషేకం.                                                 మంత్రం.                                                            ఆసనం.                                                                    తర్పణం.                                                                       గంధం.                                                              అక్షంతలు.                                                     పుష్పం.                                                   ధూపం.                                                              దీపం.                                                                                నైవేద్యం.                                                            ప్రసాదం                                                                            ఆచమనీయం.                                                   అవాహనం.                                                                    స్వాగతం.                                                                పాద్యం                                                           మధుపర్కం.                                                                                       స్నానం.                                                                         వందనం.                                                                            ఉద్వాసన....                                                                      ✴⏩✴⏩✴⏩✴⏩✴⏩
పూజ-పరమార్థాలు:
పూజ -->⏩ పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.
అర్చన-->⏩ అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
జపం-->⏩ అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
స్తోత్రం-->⏩ నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం-->⏩ ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.
దీక్ష-->⏩ దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేక:-->⏩ అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.
మంత్రం-->⏩ తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.
ఆసనం-->⏩ ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
తర్పణం-->⏩ పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
గంధం-->⏩ అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.
అక్షతలు-->⏩ కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
పుష్పం-->⏩ పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
ధూపం-->⏩ చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.
దీపం-->⏩ సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
నైవేద్యం-->⏩ ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.
ప్రసాదం-->⏩ ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
ఆచమనీయం-->⏩ లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .
ఆవాహనం-->⏩ పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
స్వాగతం-->⏩ దేవతను కుశలప్రశ్నవేయుట.
పాద్యం-->⏩ చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
మధుపర్కం-->⏩ తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
స్నానం-->⏩ గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.....
వందనం-->⏩ అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం)......
ఉద్వాసన-->⏩ దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు...

యువతులు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు చేయవచ్చా, లేదా ?
               ....సహజంగానే స్త్రీలకు భక్తి భావం ఎక్కువగా వుంటుంది.... పూజ కోసం పూలు కోయడం, వాటిని మాలగాకట్టి దైవానికి సమర్పించడంలో వాళ్లు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతుంటారు..... పూజలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ వుంటారు. శ్రావణ, కార్తీక మాసాల్లో వాళ్లు మరింత తీరికలేకుండా వుంటారు. ......
          ....అలాంటి యువతులు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు చేయవచ్చా లేదా అనే సందిగ్ధంలో పడుతుంటారు.... ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు..... ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది.... గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలనీ, కొబ్బరికాయను మాత్రం కొట్ట కూడదని చెబుతోంది... కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ, పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదని అంటోంది. ....
        ....కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.... అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది... గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.... 
          ....పూజల పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది.... ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి, అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది.... అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది..... ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది, అది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది కనుక ధ్యానం చేయడమే మంచిదని పండితులు కూడా చెబుతుంటారు....
✒
ఎలాంటి భోజనాన్ని చేయాలి? ఎలాంటి భోజనం చేయరాదు ? నియమాలు ఏమిటి ?
      .. 
• కాకులు ముట్టుకున్నదీ, కుక్క, ఆవు వాసన చూసిన భోజనాన్ని తినకూడదు.
• పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు.
• కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు.
• భార్యతో కలిసి తిన కూడదు. భర్త భుజించిన తరువాత భార్య తినాలి. కలిసి తినాల్సివస్తే ముందుగా భర్త ఓ ముద్దను తిన్న తర్వాత భార్య భర్తతో కలిసితినవచ్చు.
• భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు.
• 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.
• నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లు, నలభై దాటిన తర్వాత 15 రోజులకొక్కసారి, యాభై దాటాక నెలకొక్కసారి తీసుకోవటం ఆరోగ్యకరం.
• గ్రహణం రోజున అనగా సుర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి  తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
• దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకు పాలు సేవించరాదు.
• తడి పాదాలతో భోజనము, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి. రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది.
• అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటలో మంచినీరు ఉంచుకొనండి.
• అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సివస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి.
• ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్చి ఆపై శరీరధర్మం తీర్చండి. 
• ఆచమనం చేసిన తర్వాత తీసుకొవాలి.  అన్నమునకు నమస్కరించాలి.  అహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు.  వండిన వార్ని అభినందించాలి.
• అప్పుడే  బలాన్నీ, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది.
• భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ  తగదు.  ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు.  భార్యకు సహితము పెట్టరాదు.  పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది.  భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.
• ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆ పై భుజించాలి.  విస్తరిలో ఏమీ మిగల్చరాదు.  అవసరమైనంతే వడ్డించుకోవాలి.  లేదా వడ్డించమని చెప్పాలి.  ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి.          
•  రోజుకు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది.  రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే  ఉపవాస ఫలం కూడా వస్తుంది.
•  భోజనం చేసేటప్పుడు  తూర్పు వైపుకి తిరిగి చేయాలి.
•  తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి. 
•  పడమర, దక్షిణం వైపున భోజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ, విష్ణుపురాణం లోనూ ఉంది.  కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి.
•  ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు.
•  ధనాన్ని కోరుకొనే వాడు మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి.
•  మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.
•  భోజనానికి  ముందు, తర్వాత అచమనం చెయ్యాలి.
•  తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి
Share This :

Related Postsentiment_satisfied Emoticon