గుడ్ న్యూస్! మహిళలకు ప్రతి నెలా ₹1500పై మంత్రి కొండపల్లి కీలక ప్రకటన
By Hari Prasad
Published On:

మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇచ్చే పథకం పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన! | Aadabidda Nidhi scheme Key update From Minister
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ‘సూపర్ సిక్స్‘ హామీల్లో ముఖ్యమైనదిగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం గురించి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందించాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ హామీ ఎప్పుడు అమలులోకి వస్తుందా అని వేలాది మంది మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మంత్రి కొండపల్లి స్పందన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Aadabidda Nidhi scheme అమలుపై ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అయ్యే అంచనా వ్యయాన్ని లెక్కించే పనిలో ఉందని ఆయన స్పష్టం చేశారు. “గత ప్రభుత్వం లోటు బడ్జెట్ను మాపై మోపినా, మేము ఇప్పటికే అమ్మ ఒడి (తల్లికి వందనం), పెన్షన్ పెంపు, స్త్రీశక్తి లాంటి అనేక ముఖ్యమైన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం,” అని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. మహిళా సాధికారతకు మరియు కుటుంబాల ఆర్థిక భద్రతకు అత్యంత కీలకమైన ఈ Aadabidda Nidhi scheme అమలుకు సంబంధించి విధివిధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉద్దేశించిన ఈ ఆడబిడ్డ నిధి పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, అది రాష్ట్రంలోని మహిళా లోకానికి గొప్ప ఊరటనిస్తుంది. ఈ పథకం అమలుకు అవసరమైన అంచనాలు పూర్తై, విధివిధానాలు ఖరారైన వెంటనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేస్తూ, సాధ్యమైనంత త్వరగా ఈ Aadabidda Nidhi scheme ద్వారా మహిళలకు నెలకు రూ.1,500 అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మాటలను బట్టి అర్థమవుతోంది.